Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswati Pushkaralu 2026: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో పవిత్ర సరస్వతీ అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. త్రివేణి సంగమం వద్ద ఉదయం 5:43 గంటలకు తొలి పుష్కర స్నానం ఆచరించిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ పుష్కరాలను ప్రారంభించారు. కంచి కామకోటి పీఠం పీఠాధిపతి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. త్రివేణి సంగమ తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామిజీ, మంత్రులు పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల సందర్భంగా భక్తులతో కాళేశ్వరం కిటకిటలాడుతోంది. ఇక సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకోనున్నారు. గవర్నర్ తొలి రోజు పుష్కర స్నానం ఆచరించి, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సరస్వతీ ఘాట్‌లో జరిగే గోదావరి హారతి, తెప్పోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక సరస్వతి పుష్కరాల సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. సరస్వతి జ్ఞాన దేవత కాబట్టి, ఈ సమయంలో స్నానం చేయడం వల్ల జ్ఞానం, వివేకం పెరుగుతాయని నమ్ముతారు. విద్యార్థులకు, జ్ఞానాన్ని అన్వేషించేవారికి ఇది చాలా మంచిదని చెబుతారు. సరస్వతి అనుగ్రహంతో బుద్ధి తేటగా మారుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుందట. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళల్లో రాణించాలనుకునేవారికి ఈ స్నానం మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ఇతర పుష్కరాల మాదిరిగానే, సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. పవిత్రమైన నదిలో స్నానం చేయడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుందట. పుష్కరాల సమయంలో అనేక మంది పండితులు, సాధువులు ఒకచోట చేరతారు. వారిని కలవడం, వారి ఉపదేశాలు వినడం వల్ల మంచి జ్ఞానం లభిస్తుంది. మొత్తంగా, సరస్వతి పుష్కరాలు కేవలం స్నానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది జ్ఞానానికి, విద్యకు, కళలకు సంబంధించిన పవిత్రమైన పండుగ.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!