Sara Tendulkar and Shubman Gill Relationship News: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. 1990లో ఎయిర్‌పోర్టులో అంజలిని చూసి.. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆ సమయంలో మెడిసిన్ చేసే అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. స్నేహితురాళ్లు ‘సచిన్.. సచిన్’ అంటుండగా.. ఎయిర్‌పోర్టులో మొదటిసారి చూశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 1994లో సచిన్, అంజలిల నిశ్చితార్థం జరగగా.. 1995 మే 24న పెళ్లి చేసుకున్నారు. సచిన్ కంటే అంజలి రెండేళ్లు పెద్దది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సారా టెండ్కూలర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు.
సారా టెండూల్కర్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య ప్రేమాయాణం నడుస్తుందని గత 2-3 ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కలిసి రెస్టారెంట్స్, పార్టీలలో కనిపించడమే కాకుండా.. గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా హాజరవడమే ఇందుకు కారణం. ఈ వార్తలను సచిన్ ఫ్యామిలీ ఇంతవరకు ఖండించలేదు. మరోవైపు అలాంటిది ఏమీ లేదని గిల్ చెపుతున్నా తరచుగా ఇద్దరు కలవడంతో డేటింగ్ వార్తలకు పులిస్టాప్ పడడం లేదు. తాజాగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిర్వహించిన ఓ చారిటీ కార్యక్రమానికి గిల్‌తో పాటు సారా కూడా హాజరయ్యారు. దాంతో డేటింగ్ వార్తలు మరలా ఊపందుకున్నాయి.
Also Read: War2 Review : వార్ 2 ఓవర్సీస్ రివ్యూ..
సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ప్రేమాయాణం గురించి ఇరు కుటుంబాలకు తెలుసని ఓ ప్రచారం నడుస్తోంది. త్వరలోనే తమ రిలేషన్‌షిప్‌పై అధికారిక ప్రకటన చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. జోడీ మాత్రం బాగుంటుంది. విషయం తెలిసిన వారు ‘తండ్రి బాటలోనే తనయ’ అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. వయసులో సారా కంటే గిల్ రెండేళ్లు చిన్నోడు. ప్రస్తుతం సారా వయసు 27 ఏళ్లు కాగా.. గిల్ వయసు 25 ఏళ్లు. ప్రస్తుతం సారా, గిల్ ఇద్దరూ తమ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. సారా మోడలింగ్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఇటీవలే టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్.. ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కష్టపడుతున్నాడు.
