Sara Arjun: లైలా మజ్ను సీక్వెల్‌లో హీరోయిన్‌గా ‘ధురంధర్’ భామ..

Sara Arjun

Sara Arjun

ఇటీవల విడుదలైన ‘యుఫోరియా’ చిత్రంలో చైత్రగా నటించి మెప్పించిన సారా అర్జున్, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కళ్లలో పడింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్’తో హీరోయిన్‌గా పరిచయమైన సారా, తన క్యూట్ లుక్స్‌తో పర్ఫార్మెన్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఇంతియాజ్ అలీ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హీర్ రంఝా’లో సారా అర్జున్‌ను కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..

గతంలో తృప్తి దిమ్రీ, అవినాష్ తివారీ జంటగా వచ్చిన ‘లైలా మజ్ను’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ‘హీర్ రంఝా’ను రూపొందిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఇంతియాజ్ అలీ, ఒక కొత్త జోడీతో ఈ ఎపిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సారా అర్జున్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఒకవేళ సారా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, హిందీలో ఆమె కెరీర్‌కు ఇది పెద్ద ప్లస్ అవుతుంది. మరోవైపు సారా అర్జున్ నటించిన ‘ధురంధర్ 2’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ వల్ల సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు సౌత్‌లో ప్రాజెక్టులు చేస్తూనే, ఇటు నార్త్‌లో ఇంతియాజ్ అలీ వంటి లెజెండరీ డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం రావడం సారా అదృష్టమనే చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.