కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ ఈ సారి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. విడుదలైన ట్రైలర్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండమే కాదు.. ఎన్నో గాసిప్ లకు తావిస్తోంది. కరణ్ అడిగిన ప్రశ్నకు సమంత ‘యు ఆర్ ద రీజన్ ఫర్ అన్ హ్యాపీ మ్యారేజెస్’ అంటూ వేసిన కౌంటర్ టాక్ ఆప్ ద టౌన్‌గా మారింది. ఇక తాజాగా జాన్వీ, సారా ఇన్ డైరెక్ట్ గా విసిరిన పంచ్ వారి మాజీ లవర్‌ని బలంగా తాకేలా కనిపిస్తుంది. కరణ్ ‘మీ మాజీ మాజీగా మారడానికి కారణం’? అనగానే సారా ‘అతను ప్రతి ఒక్కరికీ మాజీనే’ అనటం తన మాజీ లవర్ కార్తీక్ ఆర్యన్‌కు పరోక్షంగా తగులుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే కార్తీక్ ఆర్యన్ అనన్య పాండే, జాన్వీ కపూర్‌తో పాటు సారా అలీ ఖాన్‌తో లవ్వాట ఆడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ మధ్య లవ్‌పై ‘లవ్ ఆజ్ కల్ 2’ షూటింగ్‌లో పుకార్లు నడిచాయి. దాదాపు ఓ సంవత్సరం పాటు ఈ జంట బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత జాన్వీ, అనన్య పాండేతో కూడా కార్తీక్ లవ్‌పై పలు పుకార్లు షికారు చేశాయి. కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ఈ నెల 7వ తేదీ నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్‌లో సమంత, అలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, వరుణ్ ధావన్, అనన్య పాండే, విజయ్ దేవరకొండ, టైగర్ ష్రాఫ్, కృతి సనన్, షాహిద్ కపూర్, కియారా అద్వానీ వంటి వారు ఈ షోలో సందడి చేయనున్నారు. ట్రైలర్‌తోనే ఇంతగా గాసిప్స్ రేకెత్తిస్తున్న షో టెలికాస్ట్ తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
https://twitter.com/karanjohar/status/1543182901956968449?s=24&t=oQVspnfpueqJ54pfXsnUeQ
