NTV Telugu Site icon

Sara Ali Khan : తనపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి ఘాటుగా స్పందించిన సారా అలీ ఖాన్

Whatsapp Image 2023 07 01 At 11.08.02 Am

Whatsapp Image 2023 07 01 At 11.08.02 Am

సినిమా సెలెబ్రేటిస్ కు సంబంధించిన ఏ విషయం అయిన కూడా సోషల్ మీడియా లో నిమిషాల వ్యవధిలో నే వైరల్ అవుతుంది. సినిమా సెలెబ్రేటీస్ ను సినిమాల్లో కనిపించిన విధంగానే రియల్ లైఫ్ లో కూడా అంతే ఉండాలి అని చాలా మంది అనుకుంటూ వుంటారు. ప్రేక్షకులకు నచ్చని పని సెలబ్రిటీలు ఏది చేసిన కూడా వారిని సోషల్ మీడియా వేదిక గా తెగ ట్రోల్ చేస్తూ వుంటారు..చాలా సార్లు ఎంతో మంది హీరో హీరోయిన్లు ఇలాంటి ట్రోలింగ్ తో బాగా ఇబ్బంది పడ్డారు.. ఇక గత కొంతకాలం నుంచి సారాఅలీ ఖాన్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ బిజీగా గడుపుతుంది.. తన అందం అభినయం తో ఇప్పటికే ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల కాలంలో ఎక్కువ గా సారా అలీఖాన్ హిందూ ఆలయాలకు వెళ్తూ కనిపిస్తుంది.

ఈ క్రమంలో నే ముస్లిం అయ్యుండి హిందూ ఆలయాలకు వెళ్లడం ఏంటి అని ఎంతో మంది సోషల్ మీడియాలో ఆమె పై దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయం గురించి సారాఅలీ ఖాన్ ఇటీవల స్పందించారనీ తెలుస్తుంది.. నాపై వస్తున్న ట్రోలింగ్ నా భక్తిని వ్యక్తపరచకుండా అయితే ఆపలేవు. మీకు నచ్చితే ఓకే.. మీకు నచ్చక పోయినా నేను ఆలయాలకు వెళ్లడం అయితే మానను. ఇది నా వ్యక్తిగత ఇష్టం అని ఆమె చెప్పుకొచ్చింది.. ప్రజలు నా సినిమాల ను ఇష్టపడుతున్నారు. కానీ ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నన్ను జడ్జ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటే అవి నేను అస్సలు పట్టించుకోను అంటూ చాలా అలీ ఖాన్ కొంచెం ఘాటుగానే స్పందించింది.

Show comments