సెలెబ్రేటీలు మరింత అందంగా ఫిట్ గా ఉండాలని తెగ కష్ట పడుతుంటారు.. షూటింగ్ లో గ్యాప్ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతారు.. భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా తన జిమ్ వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ అమ్మడు ఒకప్పుడు తన స్నేహితురాలు జాన్వీతో కలిసి, యోగ, జిమ్ చేస్తున్న వీడియోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. వీరిద్దరు చాలా కాలంగా కలిసే జిమ్ వర్కవుట్స్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు సారా మరో హీరోయిన్ అనన్యతో కలిసి జిమ్ లో కష్టపడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో సారా, అనన్య చెమటలు చిందిస్తూ వర్కవుట్స్ చేస్తున్నారు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ తో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.. మొదటి సినిమాతోనే యువతను ఆకట్టుకుంది.. . బాక్సింగ్ నేపథ్యం లో వచ్చిన ఈ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ బ్యూటీ ఇప్పటివరకు తెలుగులో మరో అనౌన్స్ చేయలేదు. మరోవైపు సారా టాలీవుడ్ ఇండస్ట్రీలో కి అరంగేట్రం చేసేందుకు సిద్ధమైందని టాక్.. ఏ హీరో సరసన హీరోయిన్ చేస్తుందో చూడాలి..
