Sapta Sagaralu Dhaati Side B : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’.. అప్డేట్ ఇచ్చిన హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగర దాచె ఎల్లో సైడ్-ఏ చిత్రం గతేడాది విడుదల అయి సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ సినిమా సప్తసాగరాలు దాటి సైడ్-ఏ పేరుతో రిలీజ్ కాగా..ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. దానికి సీక్వెల్‍గా ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమా గతేడాది నవంబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.. ఈ మూవీ తెలుగులో కూడా మంచి కలెక్షన్లను దక్కించుకుంది. అయితే, ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయి రెండు నెలలు పూర్తయినా ఈ చిత్రం ఇంకా ఓటీటీలోకి రాలేదు.’సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో కొంతకాలంగా నెటిజన్లు అడుగుతూనే వున్నారు..
ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సైడ్-ఏ కూడా ఈ ప్లాట్‍ఫామ్‍లోనే స్ట్రీమ్ అవుతోంది. దీంతో సైడ్-బీ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో హీరో రక్షిత్ శెట్టి స్పందించారు.అమెజాన్ ప్రైమ్ వీడియోలో సప్తసాగరాలు దాటి సైడ్-బీ త్వరలో వస్తుందని రక్షిత్ శెట్టి నేడు (జనవరి 20) ట్వీట్ చేశారు. “ఎస్ఎస్ఈ సైడ్‍బీ త్వరలో అమెజాన్‍లోకి వస్తుంది. విడుదల తేదీ ఖరారు చేశాక అధికారికంగా ప్రకటిస్తాం” అని ఆయన వెల్లడించారు. దీంతో త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై అమెజాన్ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈనెల చివరిలో గాని లేదా ఫిబ్రవరి ఆరంభంలో గాని సప్తసాగరాలు దాటి సైడ్-బీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.సప్తసాగరాలు దాటి సైడ్-బీ మూవీలో రక్షిత్ శెట్టి మరియు రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రలలో నటించారు.. అలాగే చైత్ర జే ఆచార్, అచ్యుత్ కుమార్, జేపీ తుమినాడ్, రమేశ్ ఇందిర మరియు గోపాల్ కృష్ణ పాండే తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
#SSESideB is coming on Amazon soon. We will announce the date as it gets confirmed 🤗
— Rakshit Shetty (@rakshitshetty) January 20, 2024
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!