Site icon NTV Telugu

Sankranti Recipes : నోట్లో వేస్తే కరిగిపోయే ‘వెన్న ఉండలు’.. ఇలా చేస్తే అద్భుతంగా వస్తాయి!

Sankranti Recipes, Venna Undalu, ః

Sankranti Recipes, Venna Undalu, ః

సంక్రాంతి పండుగ అంటేనే రకరకాల పిండి వంటల సందడి. ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే చిరుతిళ్లలో ‘వెన్న ఉండలు’ ఒకటి. నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోయే ఈ తీపి వంటకాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తాను చూడండి. దీని కోసం ముందుగా ఒక కేజీ బియ్యం పిండి తీసుకుని, అందులో తగినంత ఉప్పు, ఒక క్రికెట్ బాల్ సైజు అంత స్వచ్ఛమైన వెన్న వేసి బాగా కలుపుకోవాలి . పిండిని ముద్దగా ఒత్తితే ఉండ అయ్యేలా వెన్నను అప్లై చేయాలి. ఆ తర్వాత కొన్ని వేడి నీళ్లు పోస్తూ పిండిని పగుళ్లు లేకుండా మెత్తగా కలుపుకోవాలి.. తర్వాత

Also Read : Pregnancy Super Foods: నవ మాసాల ప్రయాణంలో.. బిడ్డ మేధస్సుకి, ఆరోగ్యానికి బలమైన 9 ఆహార పదార్థాలు!

పిండి ఆరిపోకుండా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చే వరకు ఉండలను వేయించుకోవాలి . మరోవైపు ఒక కడాయిలో ఒక కప్పు తాటి బెల్లం (లేదా మామూలు బెల్లం) తీసుకుని, కొంచెం నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత అందులో నెయ్యి, యాలకుల పొడి, నువ్వులు వేసి, ముందుగా వేయించుకున్న వెన్న ఉండలను అందులో కలిపి చల్లారనివ్వాలి . ఇలా చేస్తే ఎంతో రుచికరమైన, కరకరలాడే వెన్న ఉండలు సిద్ధమవుతాయి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా ఈ టేస్టీ రెసిపీ ప్రయత్నించి చూడండి.

Exit mobile version