Site icon NTV Telugu

MSVG: మెగాస్టారా మజాకా.. 5 రోజుల్లో “మన శంకరవరప్రసాద్ గారు” కలెక్షన్స్ ఎంతంటే..?

Manashankara Varaprasad Garu

Manashankara Varaprasad Garu

MSVG: బాక్సాఫీస్‌లో మన శంకరవరప్రసాద్ గారు హవా కొనసాగుతోంది.. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రమోషన్స్ నుంచే భారీ స్పందన వచ్చింది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ రికార్డ్ సాధించింది. ఈ వీకెండ్‌లో మరిన్ని భారీ కలెక్షన్లు రాబట్టేందుకు సిద్ధమైంది.

READ MORE: Biker Stunts In Front Police Jeep: బీహార్ హైవేపై బైక్ స్టంట్లు.. పోలీస్ వాహనం ముందే విన్యాసాలు

కాగా.. ఇప్పటివరకు అపజయమే ఎరుగని, మంచి కామెడీ టైమింగ్ ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అంతకుమించిన కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మీద ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, ఆ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు ప్రకటన రావడంతో.. ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.

Exit mobile version