NTV Telugu Site icon

Sanju Samson: టీమిండియాలో మళ్లీ అవకాశం వస్తుందని ఊహించలేదు: శాంసన్

Sanju Samson

Sanju Samson

శ్రీలంక టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో డకౌట్‌ కావడంతో.. టీమిండియాలో మళ్లీ ఆడే అవకాశం వస్తుందని తాను అస్సలు ఊహించలేదని బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. భారత జట్టులో ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉందని, మంచి ప్రదర్శన చేస్తే జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదని సంజూ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు బాదాడు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంజూ శాంసన్.. మేనేజ్‌మెంట్‌ నుంచి వచ్చిన సపోర్ట్‌తోనే తాను బాగా ఆడిగాలిగా అని చెప్పాడు. ‘బంగ్లాదేశ్‌ సిరీస్‌ ప్రారంభానికి మూడు వారాల ముందే మేనేజ్‌మెంట్‌ నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది. బంగ్లా సిరీస్‌లో ఓపెనింగ్ చేయాల్సి ఉంటుందని కోచ్‌ గౌతమ్‌ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సహాయక కోచ్ అభిషేక్ నాయర్ చెప్పారు. ప్రాక్టీస్ కోసం సమయం ఇచ్చారు. వెంటనే రాజస్థాన్‌ రాయల్స్‌ అకాడమీకి వెళ్లిపోయా. కొత్త బంతిని ఎదుర్కొన్నా. ఆ సన్నద్ధత నాకు సాయపడింది. గతంలో కంటే ఈసారి అదనంగా 10 శాతం సన్నద్ధమై వచ్చా. మేనేజ్‌మెంట్‌తో కమ్యూనికేషన్‌ కూడా మెరుగైన ప్రిపరేషన్‌కు ఉపయోగపడింది’ అని సంజూ తెలిపాడు.

Also Read: Scam Alert: మరో కొత్త తరహా మోసాలు.. జీమెయిల్‌ యూజర్లే లక్ష్యం!

‘బంగ్లా సిరీస్‌కు ముందు శ్రీలంక సిరీస్‌లో రెండు మ్యాచుల్లో డకౌట్‌ అయ్యాను. దాంతో తదుపరి సిరీస్‌లో ఆడే అవకాశం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దూకుడుగా బ్యాటింగ్‌ చేసి.. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలనే లక్ష్యంతోనే ఆడాం. తొలి మ్యాచ్‌ నుంచి ఇదే ఫాలో అయ్యాం. మూడో టీ20లో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. భారత జట్టులో ప్రతి స్థానానికి తీవ్ర పోటీ ఉంది. మంచి ప్రదర్శన చేస్తే జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదు. దేశం కోసం ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు’ అని సంజూ శాంసన్ చెప్పాడు.

Show comments