Site icon NTV Telugu

Sanju Samson: ప్లీజ్.. నన్ను వదిలేయండి బాబోయ్! శాంసన్ రెండు ఆప్షన్లు ఇవే

Sanju Samson Rr

Sanju Samson Rr

Rajasthan Royals Captain Sanju Samson Trade or Auction Options in 2025: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యాజమాన్యం, కెప్టెన్ సంజు శాంసన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో శాంసన్‌ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే) ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాంసన్ ఆర్ఆర్ జట్టులోనే ఉంటాడా?, శాంసన్‌ను రాజస్థాన్ ఫ్రాంఛైజీ ట్రేడ్ చేస్తుందా?, వేలానికి విడుదల శాంసన్‌ను ఆర్ఆర్ రిలీజ్ చేస్తుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ మేనేజ్‌మెంట్‌ ముందు శాంసన్ రెండు ఆప్షన్లను ఉంచాడట.

తనని ట్రేడ్‌ చేయాలని లేదా ఐపీఎల్ 2026 వేలంలో పాల్గొనేందుకు జట్టు నుంచి రిలీజ్‌ చేయాలని సంజు శాంసన్ అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌కు రిక్వెస్ట్ చేశాడట. శాంసన్‌ను ఆర్ఆర్ వదిలేయాలనుకుంటే.. వేరే ఫ్రాంఛైజీకి బదిలీ చేయొచ్చు లేదా వేలానికి పంపొచ్చు. నిబంధనల ప్రకారం తుది నిర్ణయం మాత్రం ఫ్రాంఛైజీదే. 2013 నుంచి 2015 వరకు రాజస్థాన్‌కు శాంసన్‌ ఆడాడు. ఆపై రెండేళ్లు (2016, 2017) ఢిల్లీకి ఆడాడు. 2018లో తిరిగి రాజస్థాన్ జట్టులో చేరాడు. ఇక 2021 నుంచి ఆర్ఆర్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రూ.18 కోట్లకు శాంసన్‌ను రిటైన్ చేసుకుంది.

Also Read: Varalakshmi Vratham 2025: నేడు వరలక్ష్మీ వ్రతం.. శుభ ముహూర్తం, పూజ విధానం ఇదే!

సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయన్నది నిజమే అని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనను వేలంలోకి పంపాలని లేదా ట్రేడ్ చేయాలని శాంసన్ అధికారికంగా మేనేజ్‌మెంట్‌ను అభ్యర్థించాడని కథనాల్లో పేర్కొన్నాయి. ఆర్ఆర్ ఫ్రాంఛైజీతో కొనసాగాలని కోరుకోవడం లేదని శాంసన్ కుటుంబ సభ్యులు బహిరంగంగానే చెబుతున్నారు. సంజు సన్నిహితులు కొంతమంది కూడా ఫ్రాంఛైజీతో అతడికి సంబంధం గతంలో మాదిరిగా లేదని అంటున్నారు. మొత్తానికి ఆర్ఆర్ ఫ్రాంఛైజీని సంజు వీడనున్నాడు. వేరే ఫ్రాంఛైజీ ఉంచి భారీ ఆఫర్ ఇప్పటికే వచ్చి ఉంటుందని కొందరు అంటున్నారు.

 

 

Exit mobile version