NTV Telugu Site icon

Sanju Samson: గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన ఆర్ఆర్ కెప్టెన్..

Sanju Samson

Sanju Samson

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) కోసం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులో చేరారు. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతని చూపుడు వేలుకు గాయమైంది. దీంతో.. క్రికెట్ అభిమానులు ఈ సీజన్‌కు దూరమవుతాడని భావించినప్పటికీ.. గత నెలలో విజయవంతమైన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో తన జట్టుతో కలిసి ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ వారి అధికారిక X హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో.. శాంసన్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వద్ద ప్రాక్టీస్ కోసం జట్టుతో చేరినట్లు కనిపించాడు.

Read Also: CM Chandrababu: సీఆర్డీఏ అధికారులతో సీఎం సమీక్ష.. ప్రధాని మోడీ పర్యటనపై చర్చ..

2024లో టీ20 మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన సంజు శాంసన్.. 13 మ్యాచ్‌ల్లో 43.60 సగటుతో 436 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై మూడు సెంచరీలు చేశాడు. అయితే.. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని ఫామ్ కాస్త పడిపోయింది. 10.20 సగటుతో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 51 పరుగులు చేశాడు. సంజు శాంసన్ గత కొన్ని సంవత్సరాలుగా రాజస్థాన్ రాయల్స్ తరపున నిలకడగా రాణిస్తున్నాడు. గత సీజన్‌లో అతను జట్టులో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 15 ఇన్నింగ్స్‌లలో 48.27 సగటుతో 531 పరుగులు, 153.46 స్ట్రైక్ రేట్‌తో 5 హాఫ్ సెంచరీలతో 86 పరుగుల అత్యుత్తమ స్కోరు సాధించాడు.

Read Also: Viral video: ‘‘నన్ను మోసం చేసి, కొత్త భార్యకు ఫోన్ కొంటున్నావా?’’.. వ్యక్తిపై గర్ల్‌ఫ్రెండ్ దాడి..

రాజస్థాన్ రాయల్స్ ఈసారి తమ 17 ఏళ్ల ట్రోఫీ కరువును ముగించాలనుకుంటోంది. గత సీజన్‌లో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. కానీ క్వాలిఫయర్- 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ సీజన్ కోసం రాజస్థాన్ తమ కోచింగ్ సిబ్బందిలో అనేక మార్పులు చేసింది. రాహుల్ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా తిరిగి నియమించింది. విక్రమ్ రాథోర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, సాయిరాజ్ బహుతులేను స్పిన్-బౌలింగ్ కోచ్‌గా నియమించారు. ఈ మార్పులతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో ట్రోఫీ సాధించడానికి ఆసక్తిగా ఉంది.