NTV Telugu Site icon

Sanju Samson Jersey: భారత్-వెస్టిండీస్‌ తొలి వన్డేలో సంజూ శాంసన్.. గందరగోళానికి గురైన ఫాన్స్!

Sanju Samson Jersey

Sanju Samson Jersey

Suryakumar Yadav wearing Jersey of Sanju Samson in IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. సంజూ స్థానంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు టీమ్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం శాంసన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ ప్లేయింగ్ 11 ప్రకటించగానే.. సంజూ ఫాన్స్ బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. సంజూపై ఎందుకింత పక్షపాతం అని కామెంట్స్ పెట్టారు.

అయితే తొలి వన్డేలో భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. సూర్య బ్యాట్‌తో కాకుండా అతడి మంచి మనసుతో అభిమానులను గెలిచాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సంజు శాంసన్ జెర్సీని ధరించి సూర్య మైదానంలోకి వచ్చాడు. దాంతో ముందుగా గందరగోళానికి గురైన ఫాన్స్.. ఆపై విషయం తెలుకున్నారు. శాంసన్ తుది జట్టులో లేనప్పటికీ.. మైదానంలో ఉన్నాడని ఫాన్స్ ఫీల్ అయ్యారు. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లోనూ మార్పు!

సంజు శాంసన్ జెర్సీని సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ధరించాడో ఖచ్చితంగా తెలియదు. అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ తుది జట్టులోకి ఎంపిక కాకపోవడంతో సూర్య మద్దతుగా నిలిచాడని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంజూ ఫాన్స్.. సూర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూర్య ఇతరుల జెర్సీ ధరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో హర్షదీప్ సింగ్ జెర్సీ వేసుకున్నాడు.

ఈ వన్డేలో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను భారత్ మట్టికరిపించింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (4/6), రవీంద్ర జడేజా (3/37) ధాటికి మొదట విండీస్‌ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. షై హోప్‌ (43; 45 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌. స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (52; 46 బంతుల్లో 7×4, 1×6) రాణించాడు.

Also Read: Boy Sell for iPhone: రీల్స్‌ మోజు.. ఐఫోన్‌ కోసం కన్న బిడ్డనే అమ్మేశారు!

Show comments