NTV Telugu Site icon

Sania Mirza: ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్‌ అవుతాం! సానియా పోస్ట్‌ వైరల్‌

Sania Mirza

Sania Mirza

Sania Mirza Post Goes Viral after Sana Javed, Shoaib Malik Weddig: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ విడిపోయారంటూ గతకొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను చాలాసార్లు పరోక్షంగా ఖండిస్తూ వచ్చారు. అయితే చివరకు అదే నిజమైంది. సానియాతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ.. మరో ఇన్నింగ్స్‌కు షోయబ్ తెరదీశాడు. పాకిస్థాన్‌ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనాకు రెండోది. షోయబ్‌ పెళ్లి నేపథ్యంలో పెళ్లి, విడాకులకు సంబంధించి ఇటీవలే సానియా ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లికి కొన్ని రోజుల ముందు సానియా మీర్జా పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. జీవితంలో ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్‌ అవుతాం అని ఓ పాపులర్‌ కొటేషన్‌ని సానియా పోస్ట్‌ చేసింది. ‘పెళ్లి కఠినమైనదే, విడాకులు కఠినమైనవే.. ఇందులో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. లావుగా ఉన్నా కష్టమే, అలాగే ఫిట్‌గా మారడమూ కష్టమైన పనే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. అప్పు చేసినా కష్టమే.. అలానే ఆర్థిక క్రమశిక్షణ పాటించడమూ కష్టమే.. ఇందులో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. మాట్లాడినా కష్టమే, మాట్లాడకపోయినా కష్టమే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. జీవితంలో ముందుకు సాగడం సులభం కాదు..మనం వేసే ప్రతి అడుగూ కష్టమైనదే. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్‌ అవుతాం. అందుకే తెలివిగా మీ మార్గాన్ని ఎంచుకోండి’ అని సానియా పేర్కొంది.

Also Read: IPL Title Sponsor: టాటా గ్రూప్‌కే మరోసారి ఐపీఎల్ టైటిల్ హక్కులు.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక మొత్తం!

2002లో ఆయేషా సిద్ధిఖీని షోయబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్నాడు. 2010లో ఆయేషాతో విడిపోయిన షోయబ్‌.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత దుబాయ్‌లో స్థిరపడ్డ ఈ స్పోర్ట్స్‌ కపుల్‌కు 2018లో ఇజాన్‌ మీర్జా మాలిక్‌ పుట్టాడు. గత రెండేళ్లుగా షోయబ్‌, సానియా విడిపోయారంటూ కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్‌ నటి సనా జావెద్‌తో సన్నిహితంగా ఉండడంతోనే సానియా అతడిని పక్కనెట్టిందని వార్తలు కూడా వచ్చాయి. చివరకు అవే వార్తలు నిజమయ్యాయి. సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్న షోయబ్‌ అందరికీ షాక్ ఇచ్చాడు.