సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా రిఫ్రెష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సానియా ఆసక్తికరమైన, కొడుకుతో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇందులో నేమ్ ప్లేట్ కూడా మార్చిన ఫోటో దర్శనమిచ్చింది. దీన్ని చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అందులో చాలా మంది సూపర్ మమ్మీ అంటూ వ్యాఖ్యానించారు.
Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని చూస్తారు..
సానియా మీర్జా 2023లో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి దుబాయ్ లో ఉంది. ఈ సూపర్ మామ్ తన బిడ్డ ఇజాన్ ను సంతోషపెట్టడానికి, అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెంచడానికి ప్రయత్నిస్తుంది. బిజీ వర్క్ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ తన కొడుకు ఇజాన్ పై మక్కువతో ఉన్న సానియా, ఇటీవల ఇజాన్ తో తన అందమైన జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేసింది.
Uttar Pradesh: 25 ఏళ్ల యువతి, 16 ఏళ్ల అబ్బాయితో లవ్.. తనతోనే ఉంటా లేకపోతే చస్తా అంటూ బెదిరింపు..
ఈ పోస్ట్ లో తల్లి కొడుకుల సంబంధించిన అనేక పోటోలను, సెల్ఫీలను కూడా షేర్ చేసింది. వీటిలో ముఖ్యంగా నేమ్ ప్లేట్ లో ‘సానియా అండ్ ఇజాన్’ అని ఉన్న ఫోటో ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చుతోంది. ఈ ఫోటోలలో ‘చూజ్ టూబీ హ్యాపీ’, ఫ్యూయల్డ్ బై కెఫీన్ అండ్ సర్కాజం’ అని రాసి వున్న గాజు కప్పులను కూడా షేర్ చేయడం విశేషం.