యంగ్ హీరో సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే, మెగా ఫ్యామిలీ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘బరి’ మూవీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘#Konidela అనే లెగసీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆ పేరు వెనుక ఎంతో కష్టం, బాధ్యత ఉన్నాయి’ అని అభిప్రాయపడ్డారు. వరుణ్ తేజ్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి చెబుతూ.. ‘నేను ఎప్పుడు మెసేజ్ చేసినా ఆయన నన్ను ‘బాబు’ అని ఆత్మీయంగా పిలుస్తారు. దానికి నేను ఎంతో గౌరవంగా ‘ఏవండీ’ అని రిప్లై ఇస్తాను’ అంటూ వారి మధ్య ఉన్న బంధాన్ని వివరించారు.
Also Read : Ramayana: రామాయణ టీజర్ పై కొత్త అప్‌డేట్..!
అంతేకాకుండా, తనకు ‘MAD’ లాంటి పెద్ద హిట్ రావడానికి కారణం కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీనే అని సంగీత్ గుర్తు చేసుకున్నారు. వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ ‘బరి’ చిత్రంలో సంగీత్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ వాలీబాల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో వరుణ్ తేజ్, సంగీత్ శోభన్ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. మొత్తనికి మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో కెరీర్‌లో దూసుకుపోతున్న సంగీత్ శోభన్, ఈ ‘బరి’తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తోంది.
