Site icon NTV Telugu

Raakaasaa: సంగీత్ శోభన్ ‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Sangeeth Shobhan, Raakaasaa

Sangeeth Shobhan, Raakaasaa

యువ నటుడు సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాకాస’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జి స్టూడియోస్ సమర్పిస్తోంది. గత ఏడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా ఘనవిజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమ్మర్ కానుకగా 2026, ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : Mrithyunjay & Vishnu Vinyasam : శ్రీవిష్ణుకు ‘డబుల్’ రిలీజ్ కష్టాలు.. ఒకే నెలలో రెండు సినిమాలు! రిస్క్ తప్పదా?

ఈ చిత్రం ఫాంటసీ, హార్రర్.. హిలేరియస్ కామెడీతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్.. గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇందులో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, రాజు ఎదురోలు ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, సంగీత్ శోభన్ కెరీర్‌లో సోలో హీరోగా ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. వేసవి సెలవుల్లో కుటుంబం అంతా కలిసి నవ్వుకునేలా ఈ ‘రాకాస’ సందడి చేయనుంది.

Exit mobile version