Site icon NTV Telugu

Sangareddy : టీఆర్ఎస్ బైక్‌ ర్యాలీ ఘటనలో మృతి చెందిన యువకుడు

Sangareddy

Sangareddy

Sangareddy : టీఆర్ఎస్ బైక్‌ ర్యాలీలో టపాసులు పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కుశాల్ అనే యువకుడు మృతి చెందాడు. అదేవిధంగా సుభాశ్, సందీప్ లకు స్వల్ప గాయాలయ్యాయి. సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ప్రారంబోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి నూతన మెడికల్ కాలేజీ దాకా టీఆర్ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీకి ప్లాన్ చేశారు. బైక్ ర్యాలీ కొత్త కలెక్టరేట్ కు చేరుకుంది.

Read Also: Kidnap : మా అభ్యర్థిని కిడ్నాప్ చేశారు.. అరవింద్ కేజ్రీవాల్

ఆకాశంలో పేల్చే రాకెట్ ప్రమాదవశాత్తు టపాసులు ఉన్న ట్రాలీ ఆటోలో పడింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన కుశాల్ 90 శాతం కాలిపోయాడు. వెంటనే అతన్ని హైదరాబాద్​ఉస్మానియా హాస్పిటల్​కు తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు. ఈ ఘటనలో ఓ మీడియా కెమెరా మెన్ బైక్ పూర్తిగా కాలిపోయింది. ఒక్కసారిగా తోపులాట జరగడంతో చింత ప్రభాకర్ కాలికి గాయమైంది. దీంతో మెడికల్ కాలేజీ దాకా కొనసాగాల్సిన ర్యాలీ మధ్యలోనే ఆపేశారు. అనంతరం నాయకులు వెళ్లి మెడికల్ కాలేజీని ప్రారంభించారు.

Read Also:Shock To TRS MLC: టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి షాక్.. క్యాసినో కేసులో ఈడీ నోటీసులు

Exit mobile version