NTV Telugu Site icon

Sandra venkata verayya: వాళ్ల మాదిరి కులాల పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేయడంలేదు

Sandra Venkata Verayya

Sandra Venkata Verayya

Sandra venkata verayya: కులం ఒకటి అయితే మరో కులం పేరు చెప్పుకొని వాళ్ళమాదిరిగా నేను రాజకీయాలు చెయ్యడం లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మద్య ఓ నాయకుడు నాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాకు ఎలాంటి దురాలావాట్లు లేవని స్పష్టం చేశారు. నేను వాళ్ల మాదిరి కులాల పేర్లు మార్చుకుని రాజకీయాలు చేయడంలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ సామాజిక వర్గానికి నేను దూరం పెడుతున్నాని కొంత మంది తప్పుడు రాజకీయ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మంది కుట్ర కుంతంతాలు రాజకీయాలు చేస్తున్నారని, కొంత మంది తాగి తందనాలు ఆడి పందెలకు వెళ్ళిన వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరబాద్ లో ఉండి ఒక ఆయన తప్పుడు ప్రచారం నాపై చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి ఉర్రుతలు ఊగే సమయంలోనే నీకు డిపాజిట్లు సత్తుపల్లిలో రాలేదు అలాంటి వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు పోటీ చెయ్.. ఎవ్వరి సత్తా ఎంటో తెలుస్తుందని సవాల్‌ చేశారు. అంతేకానీ ఎక్కడో కుర్చుని తప్పుడు ప్రచారాలు చెయ్యడం కాదు ప్రజాక్షేత్రంలో వచ్చి చూడని సవాల్‌ విసిరారు.

Read also: Balineni Srinivas Reddy: మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై బాలినేని క్లారిటీ!

అయితే తాజాగా ఖమ్మంలో తారాస్థాయికి చేరిన పొంగులేటి వర్సెస్ బీఅరెఎస్ నేతల మధ్య మాటల యుద్ధం చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. పొంగులేటి పై బీఅర్ ఎస్ నేతలు చేసిన విమర్శలకు పొంగులేటి అనుచరులు కౌంటర్‌ ఇచ్చారు. ఈనేపథ్యంలో.. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాటలు సంచలనంగా మారాయి. వెన్నుపోటు పొడవడం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు అలవాటైందని, చివర వరకు సండ్ర బీఅర్ ఎస్ పార్టీలో ఉంటారనే గ్యారెంటీ లేదన్నారు పిడమర్తి రవి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు. భారీగా వచ్చిన జన సముహంను చూసి ఎమ్మెల్యే సండ్ర కు నిద్రపట్టడం లేదని ఎద్దేవ చేశారు. వెన్నుపోటు పొడవడం సండ్రకు అలవాటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నగరంలో ఎన్నేసిన భూమిని, కారు చౌకగా తీసుకొని బీఅర్ఎస్ పార్టీ లో చేరారని ఆరోపించారు. ఈ విషయం జనం అందరికీ తెలుసన్నారు. మాకు స్పష్టమైన ఎజెండా ఉందన్నారు. ఎజెండా చెప్పే పది నియోజకవర్గాల్లో జనం ముందుకు వెళతామని తెలిపారు. పొంగులేటి పై సండ్ర వెంకటవీరయ్య వ్యక్తి గతంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కూడా సండ్ర పై వ్యక్తి గతంగా దాడి చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. త్వరలోనే సండ్ర అక్రమాల చిట్టాను బయట పెడుతామన్నారు. పార్టీలు మారే ఉసరవెల్లి సండ్ర అంటూ ఆరోపణలు గుప్పించారు. చివర వరకు సండ్ర బీఅర్ ఎస్ పార్టీలో ఉంటారనే గ్యారెంటీ లేదన్నారు. పొంగులేటి ని విమర్శించే స్థాయి సండ్రకు లేదని చేసిన కమెంట్ సంచలనంగా మారింది.
Kadiyam Srihari: సమావేశాలకు సమాచారం ఇవ్వండి.. లేదంటే అభిప్రాయ భేదాలు తప్పవు