Stampede Case: అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు.. షాక్ ఇచ్చిన కోర్టు..

Sandhya Theatre Stampede

Sandhya Theatre Stampede

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో కొత్త చిక్కు వచ్చి పడింది. నాంపల్లి కోర్టు ఛార్జ్‌షీట్‌ను తిప్పిపంపింది. ఇప్పటికే రెండుసార్లు ఛార్జ్‌షీట్‌ను రిటర్న్‌ చేసింది నాంపల్లి కోర్టు. అల్లుఅర్జున్‌ సహా 23 మందిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు అయిన విషయం తెలిసిందే. దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసుల ఛార్జ్‌షీట్‌లో సాంకేతిక లోపాలు గుర్తించింది కోర్టు. హార్డ్‌ డిస్క్‌లు, సీడీలు, పెన్‌ డ్రైవ్‌లు జతపరచకపోవడంతో ఛార్జ్‌షీట్‌ను రిటర్న్‌ చేసింది. ఇదిలా ఉండగా.. పుష్ఫ 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత కొన్ని నెలలనుంచి శ్రీతేజ్ సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందాడు. అనంతరం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డాక్టర్లు అతడ్ని డిశ్చార్జ్ చేశారు. అయితే.. ఈ ఘటనపై 23 మందిపై కేసు నమోదైంది. ఈ ఛార్జ్‌షీట్‌లో లోపాలు ఉన్నట్లు తేల్చిన కోర్టు దాన్ని తిప్పిపంపింది.

READ MORE: Accenture: ప్రమోషన్ కావాలంటే AI వాడాలి.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్..