Site icon NTV Telugu

Sandeep Reddy Vanga: నగ్నంగా హీరో… టైటిల్ పోస్టర్ షేర్ చేసిన సందీప్ రెడ్డి వంగా

Vanga Reddy

Vanga Reddy

Sandeep Reddy Vanga: టాలీవుడ్‌లో విలక్షణమైన కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడు క్రాంతి మాధవ్, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు చైతన్య రావు మదాడి కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు ‘దిల్ దియా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, దానికి ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌ను జోడించారు. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసి, యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు.

Read Also: The Raja Saab: ప్రభాస్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ముగ్గురు భామల మధ్య డార్లింగ్‌ను ఆడేసుకోనున్న వంగా!

విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్‌లో హీరో చైతన్య రావు పూర్తి రా అండ్ రూటెడ్ లుక్‌లో నగ్నంగా కనిపిస్తున్నారు. బట్టలు లేకుండా సోఫాలో కూర్చుని ఉన్న చైతన్య రావు లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ పడుతుండగా, ఆయన కళ్లలో కనిపిస్తున్న సీరియస్‌నెస్ సినిమా ఎంత ఇంటెన్సివ్‌గా ఉండబోతుందో స్పష్టం చేస్తోంది. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనే ట్యాగ్‌లైన్, ఈ సినిమా ఒక కఠినమైన వాస్తవాన్ని చూపించబోతోందని హింట్ ఇస్తోంది. ఏ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ మరియు శ్రియాస్ చిత్రాస్ బ్యానర్లపై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ రా అండ్ రూటెడ్ ఎమోషనల్ డ్రామాను వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి రా సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ పోస్టర్‌ను లాంచ్ చేయడంతో, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Exit mobile version