NTV Telugu Site icon

Project Z OTT: ఓటిటిలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Project Z

Project Z

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ప్రాజెక్ట్ z.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, ఇది ఇప్పటి నుండి పదేళ్ల తర్వాత భవిష్యత్తును అన్వేషిస్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు నలన్ కుమారసామి ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ప్రముఖ తమిళ నిర్మాత సీవీ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.. ఈ సినిమా దాదాపు ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి రాబోతుంది..

‘ప్రాజెక్ట్ జెడ్’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం.. త్వరలోనే డేట్ అనౌన్స్ చెయ్యనున్నట్లు టాక్.. తమిళంలో ‘మాయావన్’ చిత్రం తెరకెక్కింది.. ఆ సినిమానే తెలుగులో ప్రాజెక్టు జెడ్ పేరుతో విడుదల చేశారు.. సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు..

ఇక ఓటిటిలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇకపోతే సందీప్ కిషన్ సినిమాల విషయానికొస్తే.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళ హీరో ధనుష్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రాయన్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.. వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు..