Site icon NTV Telugu

Ooru Peru Bhairavakona : సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..

Whatsapp Image 2024 02 16 At 2.44.26 Pm

Whatsapp Image 2024 02 16 At 2.44.26 Pm

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం అన్ని అడ్డంకులను దాటి ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది. నేడు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడంతో మూవీ రిజల్ట్ తెలిసిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మేకర్స్ అంతా సంతోషించారు.హార్రర్ ఫాంటసీ అడ్వెంచర్గా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ అందుకుంటుంది. కొంతకాలంగా సరైన హిట్ లేని సందీప్ కిషన్ కి ఈ చిత్రం హిట్ టాక్ మంచి ఊరటను ఇచ్చింది.

రిలీజ్ కి ముందు ఈ చిత్రానికి లీగల్ అడ్డంకులు వచ్చిన విషయం తెలిసిందే. అయినా కూడా సందీప్ కిషన్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కూడా బాగానే వచ్చాయని తెలుస్తుంది. ఈ క్రమంలో ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ఓటీటీ పార్ట్నర్ మరియు రైట్స్ ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ మొత్తంలో ఈ మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ, త్వరలోనే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్, స్ట్రిమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఏ మూవీ అయినా థియేట్రికల్ రన్ అనంతరం  రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనేది ఒప్పందం వుంది.. కాబట్టి ఈ సినిమా థియేట్రికల్ రన్ అనంతరం రెండు నెలలు లేదా 45 రోజుల తర్వాత ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే ‘ఊరు పేరు భైరవకోన’ ఎప్రిల్ రెండో వారం లేదా మార్చి చివరిలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది

Exit mobile version