NTV Telugu Site icon

Michael : సందీప్ కిషన్ ‘మైఖేల్’ టెలివిజన్ ప్రీమియర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Whatsapp Image 2023 11 24 At 1.42.52 Pm

Whatsapp Image 2023 11 24 At 1.42.52 Pm

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..సందీప్ కిషన్ ఈ ఏడాది “మైఖేల్” అనే గ్యాంగ్ స్టర్ మూవీ లో హీరో గా నటించాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి , వరుణ్ సందేశ్ మరియు గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది.ఈ మూవీ భారీ అంచనాలతో ఫిబ్రవరి 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. ఇదిలా ఉంటే మైఖేల్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. నవంబర్ 25 న శనివారం సాయంత్రం ఆరు గంటలకు జీసినిమాలు ఛానెల్‌లో ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ టెలికాస్ట్ కానుంది.

రిలీజ్‌కు ముందు టీజర్‌ మరియు ట్రైలర్స్‌తో మైఖేల్ మూవీ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రొటీన్ స్టోరీ కారణంగా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్‌ కాలేదు. . మైఖేల్ మూవీ సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది కావడం గమనార్హం. ఈ సినిమా కథ విషయానికి వస్తే జైలులో పెరిగిన మైఖేల్ (సందీప్ కిషన్) ముంబాయికి ఓ లక్ష్యం కోసం వస్తాడు. ముంబాయి అండర్‌వరల్డ్ డాన్ గురునాథ్ ను (గౌతమ్ మీనన్) ఓ ఎటాక్ నుంచి రక్షించి అతడికి బాడీగార్డ్ లా మారతాడు.  ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు మైఖేల్‌. ఆమె గురునాథ్ శత్రువు రతన్ కూతురు కావడంతో మైఖేల్ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి..మైఖేల్‌ను చంపాలని గురునాథ్ కొడుకు అమర్‌నాథ్ ఎందుకు ప్రయత్నించాడు అనేదే..మైఖేల్ మూవీ కథ.థియేటర్స్ లో ఆకట్టుకోని మైఖేల్ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తోందో చూడాలి.