Site icon NTV Telugu

Sanchar Saathi App: ఇకపై అందరి ఫోన్లలో ఈ యాప్..! దీన్ని తొలగించడం కూడా సాధ్యం కాదు!

Phone

Phone

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరు స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్ లో డిజిటల్ పేమెంట్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్, ఇతరత్రా యప్స్ ఉంటూనే ఉంటాయి. అయితే ఓ యాప్ మాత్రం ఇకపై అందరి ఫోన్లలో ఉండనుంది. అంతేకాదు దీన్ని తొలగించడం కూడా సాధ్యం కాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. సైబర్ భద్రతా రక్షణను అందించే ప్రభుత్వ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేసుకోవాలని భారత ప్రభుత్వ టెలికాం మంత్రిత్వ శాఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారులను ప్రైవేట్‌గా కోరిందని ఓ నివేదిక పేర్కొంది. అయితే, దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారాన్ని అందించలేదు.

Also Read:Karnataka: కర్ణాటకలో ‘బ్రేక్‌ఫాస్ట్’ రాజకీయాలు.. రేపు డీకే ఇంటికి సిద్ధరామయ్య

భారత ప్రభుత్వం సంచార్ సాథీ యాప్‌ను కలిగి ఉంది. భారత్ లో 1.2 బిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ప్రభుత్వ యాప్ సైబర్ బెదిరింపులను నిరోధించడంలో, దొంగిలించబడిన/పోగొట్టుకున్న ఫోన్‌లను ట్రాక్ చేయడం, బ్లాక్ చేయడంలో, నకిలీ మొబైల్ ఫోన్‌లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ యాప్‌ని ఉపయోగించి ఇప్పటివరకు 700,000 పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన స్మార్ట్‌ఫోన్‌లను తిరిగి పొందగలిగారు. అక్టోబర్‌లోనే 50,000 తిరిగి పొందారు. DoT 2023లో సంచార్ సాథీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ ఆర్డర్ నవంబర్ 28న జారీ చేసినట్లు వెల్లడించింది. కొత్త యాప్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీలకు 90 రోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆర్డర్ ప్రకారం, కమ్యూనికేషన్స్ పార్టనర్ యాప్ కొత్త మొబైల్ ఫోన్‌లలో ముందే ఇన్‌స్టాల్ అవుతుందని దానిని నిలిపివేయడం లేదా తొలగించడం సాధ్యం కాదని కంపెనీలు నిర్ధారించుకోవాలి. సంచార్ సాథీ యాప్ ప్లే స్టోర్, ఐఫోన్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే సప్లై చైన్ లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల కోసం, కంపెనీలు సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ ను అందించాల్సి ఉంటుంది.

Also Read:Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్‌.. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రో-కో!

సంచార్ సాథీ యాప్‌ ఫీచర్లు

సైబర్ మోసం చేయాలనే ఉద్దేశ్యంతో మీకు కాల్, SMS వస్తే, ఈ యాప్ ద్వారా దానిని నివేదించవచ్చు.
మీ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా, హ్యాండ్‌సెట్ IMEI నంబర్‌ను యాప్‌లో నమోదు చేసి బ్లాక్ చేయొచ్చు. ఆ తర్వాత అది ఏ మొబైల్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ కాదు.
ఈ యాప్ ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కూడా తనిఖీ చేయవచ్చు. అనుమానాస్పద సిమ్ కార్డులను కూడా బ్లాక్ చేయవచ్చు.
మీరు కొత్త లేదా ఉపయోగించిన ఫోన్ కొంటున్నట్లయితే, అది అసలైనదా లేదా నకిలీదా అని తనిఖీ చేయాలనుకుంటే, మీరు సంచార్ సాథీ యాప్‌ను ఉపయోగించవచ్చు.

Exit mobile version