Site icon NTV Telugu

PEDDI : ‘పెద్ది’లో బాలయ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్?

Peddi

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది‘. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం  కోసం ‘గోల్డెన్ లెగ్’ సంయుక్త మీనన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Heroines as Action Stars : మాస్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్న స్టార్ హీరోయిన్స్‌

 రామ్ చరణ్ సినిమాల్లో పాటలు, ముఖ్యంగా మాస్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘పెద్ది’ కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేశారని సమాచారం. ఈ మాస్ నంబర్‌లో రామ్ చరణ్ సరసన సంయుక్త మీనన్ ఆడిపాడనుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సంయుక్త  తొలిసారిగా అఖండ 2 లో బాలయ్య సరసన జాజికాయ అనే స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఇప్పడు మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చరణ్ సరసన మానస వారణాసి, మృణాల్ ఠాకూర్, పూజాహెగ్డే వంటి భామల పేర్లు వినిపించాయి కానీ చివరికి సంయుక్తకు డైరెక్టర్ బుచ్చిబాబు గ్రీన్ సిగ్నల్ ఇసినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’ రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పుడు సంయుక్త మీనన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Exit mobile version