Site icon NTV Telugu

AI టెక్నాలజీతో Samsung Vision AI 4K Ultra HD Smart QLED టీవీ.. రిపబ్లిక్ డే సేల్ లో రూ.38,000 భారీ డిస్కౌంట్..!

Samsung Vision Ai 4k Ultra Hd Smart Qled

Samsung Vision Ai 4k Ultra Hd Smart Qled

Samsung Vision AI 4K Ultra HD Smart QLED TV: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన ప్రీమియం స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ శాంసంగ్ QLED స్మార్ట్ టీవీకి Vision AI 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840 x 2160 పిక్సెల్స్) ఉంది. ఇంకా ఇందులో Q4 AI ప్రాసెసర్, 100% కలర్ వాల్యూమ్ (Quantum Dot టెక్నాలజీ), HDR10 సపోర్ట్, 4K అప్స్కేలింగ్ వంటి అధునాతన ఫీచర్లు అందించబడుతున్నాయి.

OnePlus 15T Launch: 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్.. మరెన్నో మతిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 15టీ!

ఆడియో పరంగా 20W అవుట్‌పుట్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, సర్‌రౌండ్ సౌండ్ సపోర్ట్ ఉంది. అలాగే Tizen ఆపరేటింగ్ సిస్టమ్, శాంసంగ్ Knox సెక్యూరిటీ, ఇంకా కంటెంట్ యాక్సెస్ ఈ టీవీని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఈ 55 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో 178 డిగ్రీల వైయింగ్ యాంగిల్, స్లిమ్ డిజైన్‌తో ఈ టీవీ లివింగ్ రూమ్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది. HDMI, USB, Wi-Fi, Bluetooth వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఫ్లాగ్‌షిప్ రేసులో హానర్ దూకుడు.. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ స్పెక్స్ తో Honor Magic 8 Pro Air లాంచ్ కు సిద్ధం..!

ఈ శాంసంగ్ 55 అంగుళాల విజన్ ఏఐ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED టీవీ (QA55QEF1AULXL) మోడల్‌పై ఏకంగా 46 శాతం ధర తగ్గింపు అందిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 81,900గా ఉన్న ధరను ఇప్పుడు కేవలం రూ.43,990కే అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా దీనికి వినియోగదారులకు నో కాస్ట్ EMI సౌకర్యం కూడా లభిస్తోంది. నెలకు కేవలం రూ. 1,547 నుంచి EMI ప్రారంభం అవుతుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే రూ. 1,319 వరకు క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version