NTV Telugu Site icon

Samsung AI TV 2024: ఏఐ ఫీచర్లతో శాంసంగ్‌ స్మార్ట్‌టీవీలు.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే!

Samsung Ai Tv 2024

Samsung Ai Tv 2024

Samsung Launches AI TVs in India: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ సంస్థ ‘శాంసంగ్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్, టీవీలను రిలీజ్ చేస్తూ.. భారత్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తాజాగా కొత్త టీవీలను బుధవారం భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. నియో క్యూఎల్‌ఈడీ 8కె, నియో క్యూఎల్‌ఈడీ 4కె సహా ఓఎల్‌ఈడీ టీవీ పేరుతో కొత్త స్మార్ట్‌ టీవీలను రిలీజ్ చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఫీచర్లతో ఈ టీవీలను విడుదల చేస్తున్నట్లు శాంసంగ్‌ తెలిపింది.

శాంసంగ్‌ నియో క్యూఎల్‌ఈడీ 8కె ప్రారంభ ధర రూ.3,19,990గా శాంసంగ్‌ నిర్ణయించింది. ఈ 8K టీవీలు QN900D, QN800D మోడళ్లలో అందుబాటులో ఉంటాయి. ఇందులో మూడు రకాల స్క్రీన్‌ సైజులు (65, 75, 85 అంగుళాలు) ఉంటాయి. ఈ టీవీలో NQ8 AI జెన్‌3 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. 8కె సిరీస్‌లోని స్మార్ట్‌టీవీల్లో ఏఐ పిక్చర్ టెక్నాలజీ, ఏఐ అప్‌స్కేలింగ్ ప్రో, ఏఐ మోషన్ ఎన్‌హాన్సర్ ప్రో, రియల్ అండ్ డెప్త్ ఎన్‌హాన్సర్ ప్రో, ఏఐ కస్టమైజ్డ్‌ మోడ్, ఏఐ ఎనర్జీ మోడ్ లాంటి ఎన్నో ఏఐ ఫీచర్లు ఉన్నాయి. వీటితో యూజర్లు మెరుగైన సౌండ్‌, డిస్‌ప్లే అనుభవాన్ని పొందుతారు.

నియో క్యూఎల్‌ఈడీ 4కె ధర రూ.1,39,990 నుంచి మొదలవుతుంది. ఈ టీవీలు QN85D, QN90D వేరియంట్లలో ఐదు రకాల డిస్‌ప్లే పరిమాణాల్లో (55, 65, 75, 85, 98 అంగుళాలు) అందుబాటులో ఉన్నాయి. S95D, S90D వేరియంట్లలో నాలుగు రకాల స్క్రీన్‌ పరిమాణాల్లో (55, 65, 77, 83 అంగుళాలు) లభిస్తాయి. మోషన్‌ ఎక్సలేటర్‌ ఫీచర్లతో తీసుకొచ్చిన టీవీ 144Hz రిఫ్రెష్‌ రేటు కలిగిఉంటాయి. ఇక ఓఎల్‌ఈడీ టీవీ ధరలు రూ.1,64,990 మొదలవుతాయి.

Also Read: Vivo T3X 5G Price: వివో నుంచి బడ్జెట్‌ 5G ఫోన్‌.. ధర, ఫీచర్స్ ఇవే!

ప్రత్యేక లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా 2024 స్మార్ట్‌ టీవీ సిరీస్‌లోని ఎంపిక చేసిన వాటిని కొనుగోలు చేస్తే.. రూ.79,990 విలువైన సౌండ్‌బార్‌ను ఉచితంగా అందించనున్నట్లు శాంసంగ్‌ కంపెనీ తెలిపింది. ఎంచుకున్న మోడల్‌ని బట్టి రూ.29,990 విలువైన మ్యూజిక్‌ ఫ్రేమ్‌, రూ.59,990 విలువైన ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్‌, 20 శాతం క్యాష్‌బ్యాష్‌ వస్తుంది. అయితే ఈ ఆఫర్ ఏప్రిల్‌ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.