NTV Telugu Site icon

Samsung Galaxy Z Fold 5, Flip 5 Price: శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్ 5, జెడ్‌ ఫ్లిప్ 5 లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Samsung Galaxy Z Fold 5 And Flip 5

Samsung Galaxy Z Fold 5 And Flip 5

Samsung Galaxy Z Fold 5 and Samsung Galaxy Z Flip 5 Price in India: దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ దిగ్గజం ‘శాంసంగ్‌’కు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. నిత్యం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో రెండు 5G స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. బుధవారం జరిగిన శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 (Samsung Galaxy Z Fold 5), శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 (Samsung Galaxy Z Flip 5) ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్స్ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy Z Flip 5 Price:
శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ 8GB, 256GB.. 8GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 8GB, 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర భారతదేశంలో రూ. 99,999 కాగా.. 8GB, 512GB స్టోరేజ్ ధర రూ. 1,09,999గా ఉంది. ఈ ఫోన్ క్రీమ్, గ్రాఫైట్, లావెండర్, మింట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 ప్రీ ఆర్డర్స్ గురువారం (జులై 27) నుంచి ప్రారంభం అయ్యాయి. భారత్‌లో ఈ ఫోన్ సేల్స్ ఆగస్టు 11న ప్రారంభమవుతాయి.

Samsung Galaxy Z Flip 5 Features:
గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్ 5 ఫోన్ 3.4 అంగుళాల సూపర్ అమోలెడ్‌ 60Hz కవర్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటెడ్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్‌ మెయిన్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే, వెనుక ప్యానెల్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12MP అల్ట్రా-వైడ్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 12MP వైడ్ యాంగిల్ కెమెరా ఉండగా.. ఇన్నర్ డిస్‌ప్లేలో 10MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 3,700mAh బ్యాటరీ ఉంటుంది.ఈ ఫోన్ కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్ట్ One UI 5.1.1తో రన్ అవుతుంది.

Also Read: Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్ ధమాకా ఆఫర్.. 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై 75 వేల డిస్కౌంట్! బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కాకుండానే

Samsung Galaxy Z Fold 5 Price:
శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ 12GB RAM.. 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో భారతదేశంలో లభిస్తుంది. 12GB RAM, 256GB వేరియంట్ ధర రూ. 1,54,999 కాగా.. 12GB RAM, 512GB వేరియంట్ ధర రూ. 1,64,999గా ఉంది. ఇక 12GB RAM, 1TB వేరియంట్ ధర భారతదేశంలో రూ. 1,84,999గా ఉంది. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగులలో లభిస్తుంది. ఐసీ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy Z Fold 5 Features:
గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్ 5 7.6 అంగుళాల QXGA+డైనమిక్ అమోలెడ్‌ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. డైనమిక్ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేతో కూడిన 6.2 అంగుళాల హెచ్‌డీ+ కవర్ స్క్రీన్‌ ఉంటుంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP వైడ్ యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉంటాయి. ఈ ఫోన్‌లో రెండు ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. కవర్ డిస్‌ప్లేలో 10MP లెన్స్, లోపలి డిస్‌ప్లే 4MP కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 4,400mAh బ్యాటరీతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ One UI 5.1.1తో రన్ అవుతుంది. ఇక ఈ ఫాన్స్ ప్రీ బుకింగ్ చేసిన వారికి రూ. 23,000 విలువైన స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి.

Also Read: SBI WhatsApp Service: ఎస్‌బీఐ వాట్సాప్‌ సర్వీసులు.. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా 15కు పైగా సేవలు!

Show comments