Samsung to Launch Samsung Galaxy Z Fold 5 and Samsung Galaxy Z Flip 5 on July 26: దక్షిణ కొరియాకు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ మరో రెండు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Z Fold 5), శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5) పేరుతో ఫోల్డబుల్ మొబైల్స్ రిలీజ్ చేస్తోంది. 2023 జులై 26న ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు ఫోల్డబుల్ మోడల్స్ విడుదల కానున్నాయి. ఈ రెండు కొత్త ఫోల్డబుల్ మొబైల్స్ ప్రీ బుకింగ్స్ నేడు ప్రారంభం కానున్నాయి.
Samsung Galaxy Z Fold and Samsung Galaxy Z Flip Pre Bookings:
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లను ముందుగానే కొనుగోలు చేయాలనుకొనే వారికి ప్రీ బుకింగ్స్ సదుపాయాన్ని శాంసంగ్ కంపెనీ తీసుకొచ్చింది. ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్లలో శుక్రవారం (జులై 7) సాయంత్రం 4 గంటల నుంచి ప్రీ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రీ బుకింగ్స్ ఆఫర్‌లో భాగంగా రూ. 2 వేలతో బుక్ చేసుకునే సదుపాయాన్ని శాంసంగ్ కల్పించింది.
Also Read: ODI World Cup 2023: ప్రపంచకప్ 2023కి శ్రీలంక, నెదర్లాండ్స్ అర్హత.. భారత్ లేటెస్ట్ షెడ్యూల్ ఇదే!
Samsung Galaxy Z Fold 5 Price:
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ.1,47,000గా ఉండే అవకాశం ఉంది. బ్లూ, ప్లాటినం, లేత గోధుమ రంగు, నలుపు, లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాససర్ ఇందులో ఉంది. 4400 mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్.. QXGA+ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఇందులో 12జీబీ ర్యామ్ ఉండగా.. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజీ సదుపాయంతో రానుంది. 50 ఎంపీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సర్, 12 ఎంపీ టెలీఫోటో లెన్స్ ఉండనున్నాయి.
Samsung Galaxy Z Flip 5 Price:
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్ ధర దాదాపుగా రూ. 90 వేలు ఉండనుంది. గెలాక్సీ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాససర్, 4100 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 6.82 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను కలిగి ఉంటుంది. 12జీబీ ర్యామ్.. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజీ సదుపాయం ఉండనున్నాయి. ఈ జెడ్ ఫ్లిప్ 5లో వెనకవైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, సెల్ఫీ కోసం 12 ఎంపీ కెమెరా ఉంటుంది.
Also Read: iPhone 13 Mini Price 2023: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13 మినీపై రూ. 18200 ఆదా!