Site icon NTV Telugu

Galaxy S23 FE Launch: గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌.. 50ఎంపీ కెమెరా, 4500 బ్యాటరీ!

Samsung Galaxy S23 Fe New

Samsung Galaxy S23 Fe New

Samsung Galaxy S23 FE 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ‘శాంసంగ్‌’.. గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. అక్టోబర్‌ 26 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎస్‌23 తరహాలోనే వెనక వైపు ట్రిపుల్‌ కెమెరా సెట్‌, డిజైన్‌తో ఈ ఫోన్ వస్తోంది. ప్రస్తుతం ఎస్‌23 ఎఫ్‌ఈ ఫోన్‌ శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ 128GB మెమొరీ, 8GB ర్యామ్‌ 256GB మెమొరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ క్రీమ్‌, పర్పుల్‌, గ్రాఫైట్‌, మింట్‌ రంగుల్లో లభిస్తుంది. గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ ధర 599 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 49,800)గా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Also Read: Virat Kohli Tickets: ముందే చెబుతున్నా.. ప్రపంచకప్ 2023 టికెట్స్ ఎవరూ అడగొద్దు: కోహ్లీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.3 ఇంచెస్ అమోలెడ్‌ ప్యానల్‌తో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో రానుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 లేదా ఎక్సినోస్‌ 2200 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ ఇందులో ఉంటుంది. 50 ఎంపీ + 8 ఎంపీ +12 ఎంపీకెమెరాలు ప్రధాన కెమెరాలో.. 10 ఎంపీ కెమెరా ముందుభాగంలో ఉంటుంది. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 25వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్లూటూత్‌ 5.3, వైఫై 6ఈ, ఎన్‌ఎఫ్‌ఎస్‌, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఎస్‌23 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.

 

 

Exit mobile version