Galaxy S23 FE Launch: గెలాక్సీ ఎస్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్.. 50ఎంపీ కెమెరా, 4500 బ్యాటరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy S23 FE 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ‘శాంసంగ్’.. గెలాక్సీ ఎస్ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. అక్టోబర్ 26 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎస్23 తరహాలోనే వెనక వైపు ట్రిపుల్ కెమెరా సెట్, డిజైన్‌తో ఈ ఫోన్ వస్తోంది. ప్రస్తుతం ఎస్23 ఎఫ్‌ఈ ఫోన్ శాంసంగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ 128GB మెమొరీ, 8GB ర్యామ్ 256GB మెమొరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ క్రీమ్, పర్పుల్, గ్రాఫైట్, మింట్ రంగుల్లో లభిస్తుంది. గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ ధర 599 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 49,800)గా ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Also Read
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
Also Read: Virat Kohli Tickets: ముందే చెబుతున్నా.. ప్రపంచకప్ 2023 టికెట్స్ ఎవరూ అడగొద్దు: కోహ్లీ
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్ 6.3 ఇంచెస్ అమోలెడ్ ప్యానల్‌తో పంచ్ హోల్ డిస్‌ప్లే, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో రానుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 లేదా ఎక్సినోస్ 2200 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఇందులో ఉంటుంది. 50 ఎంపీ + 8 ఎంపీ +12 ఎంపీకెమెరాలు ప్రధాన కెమెరాలో.. 10 ఎంపీ కెమెరా ముందుభాగంలో ఉంటుంది. 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 25వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ 5.3, వైఫై 6ఈ, ఎన్‌ఎఫ్‌ఎస్, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!