Samsung Galaxy M15 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎం సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ఎం 15 5జీ’ ప్రైమ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం 15’ 5జీని కంపెనీ తీసుకొచ్చింది. ఆ ఫోన్‌లోనే స్వల్ప మార్పులు చేసి.. ఇప్పుడు ప్రైమ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. తక్కువ ధరలో సూపర్ కెమెరా, బిగ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999గా.. 6జీబీ+128జీబీ ధర రూ.11,999గా ఉంది. హై ఎండ్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధరన రూ.13,499గా కంపెనీ నిర్ణయించింది. బ్లూ టోపాజ్, సెలిస్టెయిల్ బ్లూ, స్టోన్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్లు, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
Also Read: Devara-NTR: ‘దేవర’ భయాన్ని పోగొడతాడా?.. లేదా మరింత భయపెడతాడా?
ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేటు, మీడియా టెక్ డైమెన్‌సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్, ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో ఇది వస్తోంది. శాంసంగ్ వన్‌యూఐ 6.0తో పనిచేసే ఈ ఫోన్‌కు నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఉన్నాయి. ఫోన్ వెనక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇక ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్స్ వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.