Site icon NTV Telugu

Samsung Galaxy F55 Price: లెదర్‌ ఫినిష్‌తో శాంసంగ్‌ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

Samsung Galaxy F55 Price

Samsung Galaxy F55 Price

Samsung Galaxy F55 5G Launch and Price in India: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్‌’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తన ఎఫ్‌ సిరీస్‌లో భాగంగా ఎఫ్‌55 5జీని ఈ రోజు (మే 27) రిలీజ్ చేసింది. లెదర్‌ ఫినిష్‌తో ఈ ఫోన్‌ రావడం గమనార్హం. ఎన్‌ఎఫ్‌సీ, 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అయితే ఛార్జర్‌ ఇవ్వడం లేదు. ఛార్జర్‌ వేరుగా కొనాల్సి ఉంటుంది. శాంసంగ్‌ ఎఫ్‌55 5జీ ఫోన్‌ ధర, ఇతర వివరాలను ఓసారి చూద్దాం.

Samsung Galaxy F55 5G Price:
శాంసంగ్‌ ఎఫ్‌55 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.26,999గా ఉండగా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా ఉంది. ఇక 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు నుంచే సేల్స్ ప్రారంభం కానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.2వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది. లాంచ్‌ ఆఫర్‌ కింద మే 31వ లోపు కొనుగోలు చేసే వారికి.. 45W అడాప్టర్‌ను రూ.499కే లభిస్తుంది.

Samsung Galaxy F55 5G Specs:
శాంసంగ్‌ ఎఫ్‌55 5జీలో 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేని ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటు, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌ను ఇందులో ఉంటుంది. ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14తో ఇది వస్తోంది. నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఉంటాయి.

Also Read: Sitara-Mahesh Babu: మహేష్ బాబు అసలు సీక్రెట్ చెప్పేసిన సితార!

Samsung Galaxy F55 5G Camera and Battery:
ఎఫ్‌55 5జీలో వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (ఓఐఎస్)తో వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ ఇచ్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా… 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Exit mobile version