దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్’ బడ్జెట్ శ్రేణిలో మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. భారతదేశంలో Galaxy A07, Galaxy F07, Galaxy M07 4Gలను విడుదల చేసింది. ఈ ఫోన్‌లన్నీ దాదాపుగా ఒకే ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మూడు స్మార్ట్‌ఫోన్‌ల పేర్లు, కలర్స్, ధరలలో మాత్రమే తేడాలు ఉన్నాయి. ఈ మూడు ఫోన్స్ వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి.
మూడు స్మార్ట్‌ఫోన్‌లు 6.7 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇందులో 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. Samsung Galaxy A07 4Gని కంపెనీ రూ.8,999కి లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు రంగులలో (నలుపు, ఆకుపచ్చ మరియు లేత వయొలెట్) వస్తుంది. మీరు దీన్ని శాంసంగ్ అధికారిక స్టోర్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy F07 ఫోన్ రూ.7,699కి లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ ఒకే ఒక రంగు (ఆకుపచ్చ) ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy M07 4Gని కంపెనీ రూ.6,999కి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా అమెజాన్‌లో లభిస్తుంది. ఈ మూడు హ్యాండ్‌సెట్‌లన్నీ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌లో అందుబాటులో ఉంటాయి. మూడు ఫోన్‌లలో 90Hz రిఫ్రెష్ రేట్, IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించి ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు.
Also Read: Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుంది.. రోహిత్ శర్మ వీడియో వైరల్!
మూడు స్మార్ట్‌ఫోన్‌లు Android 15 ఆధారంగా One UI 7పై రన్ అవుతాయి. మూడింటిలో కంపెనీ ఆరు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. మూడు ఫోన్‌లు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తాయి. కంపెనీ 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించింది. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 25W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. మూడు ఫోన్‌లు కూడా 4G మద్దతుతో వస్తాయి.
