Site icon NTV Telugu

Samsung Galaxy A15 5G: త్వరపడండి.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌పై భారీ డిస్కౌంట్..

Samsung

Samsung

Samsung Galaxy A15 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ మరో ఆకట్టుకునే ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 2023లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అధునాతన ఫీచర్లతో పాటు సురక్షితమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఇస్తోంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ వేరియంట్‌ సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,399 కు అందుబాటులో ఉండగా.. 8GB + 128GB వేరియంట్ రూ.16,999 కు లభిస్తుంది. 8GB + 256GB వేరియంట్‌ ధర రూ.21,295 గా ఉంది. ఇక వీటికి ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. మరో 5% అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. లైట్ బ్లూ, బ్లూ, బ్లూ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Also Read: Crime: డబ్బు కోసం స్నేహితులతో భార్యపై అత్యాచారం.. మూడేళ్లుగా నరకం..

ఇక ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. ఈ మొబైల్ లో 6.5 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే , 90Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఇక చిప్‌సెట్, సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇందులో.. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఆక్టాకోర్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OneUI 5, ఇంకా 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇవ్వనున్నట్లు శాంసంగ్ హామీ ఇచ్చింది. ఇక మొబైల్ కెమెరా విషయానికి వస్తే.. వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్, అందులో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరా ఉండగా.. ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంటుంది.

Also Read: 1978 Sambhal Riots: 1978 సంభాల్ అల్లర్లపై మళ్లీ దర్యాప్తు..? చరిత్రలోనే అతిపెద్ద మత ఘర్షణలు..

ఇక మొబైల్ లో బ్యాటరీ & ఛార్జింగ్ విషయానికి వస్తే.. 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇక మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే.. 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, WiFi 802 , USB-C ఛార్జింగ్ పోర్టు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలిరోమీటర్, జియోమాగ్నటిక్ సెన్సార్ లు కలిగి ఉంది.

Exit mobile version