దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఇ-కామర్స్ దిగ్గజాలు ‘అమెజాన్’ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ‘ఫ్లిప్‌కార్ట్’ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను ఇప్పటికే ఆరంభించాయి. మరోవైపు ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా ఫెస్టివ్ ఆఫర్స్ ప్రకటించాయి. ‘శాంసంగ్’ కూడా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 22 నుంచే ఫెస్ట్ ఆరంభం కాగా.. శాంసంగ్.కామ్, శాంసంగ్ షాప్ యాప్ సహా శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్, గృహోపకరణాల ఉత్పత్తులపై శాంసంగ్ భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలపై కళ్లు చెదిరే ఆఫర్స్ ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఎయిర్ కండిషనర్లు, స్మార్ట్ టీవీలు, మానిటర్ల కొత్త ధరలు ఇప్పటికే శాంసంగ్ తన వెబ్‌సైట్‌లో అప్ డేట్ చేసింది. ధరల తగ్గింపుతో పాటు వినియోగదారులు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, వారంటీలు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఈఎంఐ ఎంపికలను కూడా పొందవచ్చు.
శాంసంగ్ ది ఫ్రేమ్, శాంసంగ్ నియో క్యూఎల్‌ఈడీ వంటి ప్రీమియం టీవీలపై 51 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ది ఫ్రేమ్ 50 ఇంచెస్ టీవీ ధర రూ.1,24,900గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో 45 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. ప్రస్తుతం ఈ టీవీ రూ.68,199కి అందుబాటులో ఉంది. 10 శాతం బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. అలానే నియో క్యూఎల్‌ఈడీ 55 ఇంచెస్ టీవీపై 49 శాతం తగ్గింపు ఉంది. రూ.1,89,990 ఉన్న టీవీ రూ.96,795కి మీ సొంతం అవుతుంది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
Also Read: IND vs BAN: వాడు వచ్చేశాడు.. ఇక వార్ వన్‌సైడే!
ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో ఎంపిక చేసిన మోడళ్లలో ఉచిత సౌండ్‌బార్ లేదా అదనపు టీవీ కూడా మీకు లభిస్తుంది. అదనంగా రూ.5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, 30 నెలల వరకు ఈఎంఐ, 3 సంవత్సరాల పొడిగించిన వారంటీ ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లు 46 శాతం వరకు తగ్గింపుతో పాటు డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్లపై 20 సంవత్సరాల వారంటీతో లభిస్తాయి. వాషింగ్ మెషీన్లు 48 శాతం వరకు తగ్గింపుతో కూడా లభిస్తాయి. వీటిలో ఫ్రంట్-లోడ్, టాప్-లోడ్ ఎంపికలు రెండూ ఉన్నాయి. అన్ని మోడళ్లలో ఏఐ ఆధారిత క్లీనింగ్, 20 సంవత్సరాల వారంటీ ఉన్నాయి. విండ్‌ఫ్రీ ఏసీలపై 48 శాతం వరకు తగ్గింపుతో ఎయిర్ కండిషనర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్‌లో స్మార్ట్‌వాచ్‌లపై కూడా ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్, గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ బడ్స్ 3 ప్రో, గెలాక్సీ బడ్స్ 3 సహా గెలాక్సీ బడ్స్ కోర్‌లపై 50 శాతం వరకు తగ్గింపు ఉంది. తగ్గింపు మాత్రమే కాదు రూ.20,000 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
