Bihar CM Samrat Choudhary: “సామ్రాట్ చౌదరి అనే నేను”.. బీహార్‌లో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar CM Samrat Choudhary: బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీహార్ బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. సీనియర్ బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి బుధవారం బీహార్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అగ్రశ్రేణి బీజేపీ నాయకులు, మిత్రపక్షాల భాగస్వాముల సమక్షంలో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చౌదరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ మొట్టమొదటి సారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక గత రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న నితీష్ కుమార్ శకానికి తెరపడింది. హిందీ హృదయభూమి అయిన బీహార్‌లో బీజేపీ అడుగు పెట్టింది.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
ఇక, బీహార్ రాజకీయాల్లో కీలకమైన ‘కోయిరి’ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయిన రెండో నేతగా సామ్రాట్ చౌదరి రికార్డు సృష్టించారు. గతంలో 1968లో సతీష్ ప్రసాద్ సింగ్ కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ పదవిలో ఉన్నారు. అలాగే, కర్పూరీ ఠాకూర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి.. రెండు పదవులను చేపట్టిన అతికొద్ది మంది నాయకులలో ఒకరిగా నిలిచారు. 1999లో రబ్రీ దేవి క్యాబినెట్‌లో అతి చిన్న వయసులోనే మంత్రిగా చేరిన చౌదరి, అప్పట్లో వయస్సు వివాదం కారణంగా పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2000లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆర్‌జేడీ చీఫ్ విప్‌గా పనిచేశారు. 2014లో జితన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, నితీష్ కుమార్ తిరిగి రావడంతో బయటకు వచ్చారు. 2017లో బీజేపీలో చేరిన తర్వాత చౌదరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాష్ట్ర ఉపాధ్యక్షుడి స్థాయి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆపై ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు. గతంలో నితీష్ కుమార్‌ను గద్దె దించే వరకు తన తలపాగా తీయనని శపథం చేసిన ఆయన, ఇప్పుడు అదే నితీష్ స్థానంలో ముఖ్యమంత్రి కావడం విశేషం.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!