Site icon NTV Telugu

Samarth App: ఏపీ ఎన్నికలు 2024.. క్విక్ పోలీసింగ్‌ కోసం ఈసీ కొత్త యాప్‌

Samarth

Samarth

Samarth App: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు చకచకా అడుగులు ముందుకు పడుతున్నాయి.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు.. ఈరోజు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి చేశారు.. సరైన ఫార్మాట్‌, తప్పుగా ఉన్న నామినేషన్లను తిరస్కరించారు.. మరోవైపు.. ఎన్నికల ప్రచారంపై అన్ని పార్టీలు ఫోకస్‌ పెట్టాయి.. ఇక, మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కీలకమైన పోలింగ్‌ జరగనుండగా.. ఈ సమయంలో ఎటు వంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” (“SAMARTH”-Security Arrangement Mapping Analysis Response Tracking Hub) మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ యాప్ ను అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, సెక్టర్ ఆఫీసర్లు వినియోగించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.

Read Also: Maldives: మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించిన డ్రాగన్ రీసెర్చ్ షిప్.. ఆంతర్యమేంటో..!

సార్వత్రిక ఎన్నికల వేళ స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ కై ఈ మొబైల్ యాప్ ఎంతగానో దోహదపడుతుందని, సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాల లొకేషన్లను ఎంతో సులభంగా గుర్తించ వచ్చని, తద్వారా మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలను తక్షణమే పంపించేందుకు అవకాశం ఉంటుందని మరియు కంట్రోల్ రూమ్ నుండే పోలీస్ బలగాల లొకేషన్ లు గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఈవో మీనా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వంటి స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ మొబైల్ యాప్ ను అభివృద్ది పర్చి ప్రయోగాత్మకంగా బాపట్ల జిల్లాలో వినియోగిస్తున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌ని అభినందించింది ఈసీ.. బాపట్ల జిల్లా ఎస్సీ శ్రీ వకుల్ జిందాల్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి.. తమ జిల్లాలో ఉపయోగిస్తున్న ఈ సమర్థ్ మొబైల్ యాప్ విశిష్టతను, విశేషాలను వివరించారు.

Read Also: Spiderman: స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డుపై రెచ్చిపోయిన యువ జంట.. సీన్ కట్ చేస్తే..

ఇక, తమ జిల్లా ఐటీ కోర్ విభాగం రూపొందించిన ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా ఈ నెల 22 వ తేదీ నుండి తమ జిల్లాలో వినియోగిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా పోలీస్ అధికారులు డైరెక్ట్ గా కాల్ చేయవచ్చని, ఒక్క నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వున్న 2000 మంది పోలీసులకు ఒకేసారి ఆదేశాల జారీ చేయవచ్చని తెలిపారు. మొబైల్ కి ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా నోటిఫికేషన్ ద్వారా వారికి సమాచారం అందుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి వచ్చే పిటిషన్లను సంబంధిత పోలీస్ అధికారులకు యాప్ ద్వారా పంపి ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. మొత్తం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క వివరాలు, మొబైల్ నెంబర్స్ యాప్ నందు పొందుపరచబడినవి అని, తద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క రియల్ టైమ్ లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయడం జరుగుతుందన్నారు. అదే విదంగా సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడానికి, యాప్ నుండి నేరుగా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయడానికి, సమస్యాత్మక ప్రాంతాలకు తక్షణమే పోలీస్ బలగాలు చేరుకోవడానికి, శక్తివంతమైన, బలమైన మరియు నిజ-సమయ అప్లికేషన్ గా ఈ యాప్ పనిచేస్తున్నదని సీఈవో ముకేష్ కుమార్ మీనాకు వివరించారు.. మొత్తంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో “సమర్థ్” యాప్‌ను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌..

Exit mobile version