Site icon NTV Telugu

Samantha: పాన్ ఇండియా నెం.1 హీరోయిన్గా సమంత.. ఇది సార్ క్రేజ్ అంటే!

Samantha Queen

Samantha Queen

Samantha Ruth Prabhu shines at No.1 Position: ప్రతి నెల లాగానే ఈ నెల కూడా ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్‌లో సమంత రూత్ ప్రభు నెం.1 పొజిషన్‌లో మెరిసింది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత రూత్ ప్రభు ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. తన మొదటి సినిమాలో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి వివాహమాడిన ఆమె కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఆయనకు విడాకులు ఇచ్చేసింది. ఇక భర్తతో విడిపోయిన తర్వాత సమంత ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ఆమె పలు ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో భాగమవుతుంది. కొద్దికాలం వరకు వరుసగా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులు ఒప్పుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు లవ్ స్టోరీస్ లో కూడా నటిస్తోంది. రొమాన్స్ లో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆమె నటిస్తోంది.

Rashmika Mandanna : ఆ విషయంలో ఇప్పటికీ నేను బాధ పడుతూనే వుంటాను

ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషీ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక మరో పక్క సిటాడెల్ ఇండియన్ అడాప్టెడ్ వెర్షన్ లో కూడా ఆమె నటిస్తోంది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన పాత్రలో సమంత నటిస్తుందని ప్రచారం జరుగుతున్నా సిరీస్ రిలీజ్ అయ్యే వరకు అది నిజమో కాదో తెలియదు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆమె ఏకంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న ఒక వార్త అయితే టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది ఈ విషయాన్ని సమంత సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి కూడా. అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు సమంత పాన్ ఇండియా టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి పదిమందిలో టాప్ ప్లేస్ సంపాదించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె ఇలా టాప్ ప్లేస్ సంపాదించడం ఇది ఎనిమిదో సారి. దీంతో సమంత అభిమానులు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మా సమంత తోపురా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version