NTV Telugu Site icon

Samantha-Fan: ప్ర‌పోజ్ చేసిన అభిమాని.. ఓకే చెప్పిన సమంత! వీడియో వైర‌ల్‌

Samantha

Samantha

Fan proposed Actress Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ స‌మంత మాజీ భ‌ర్త, టాలీవుడ్ హీరో నాగచైత‌న్య రెండో పెళ్లి చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా న‌టి శోభిత ధూళిపాళ్లతో చై ఏంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. త్వరలోనే చై-శోభిత వివాహం జరగనుంది. నాగచైత‌న్య ఏంగేజ్‌మెంట్ అనంత‌రం స‌మంత ట్రెండింగ్‌లోకి వచ్చారు. నెట్టింట సామ్‌కు అభిమానులు అండగా నిలిచారు. అయితే ఓ అభిమాని సమంతకు ప్ర‌పోజ్ చేశాడు. అందుకు సామ్ ఓకే చెప్పడం విశేషం.

ముఖేష్ చింత అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఓ వీడియోను రూపొందించి సమంతకు ప్రపోజ్ చేశాడు. ‘సమంత.. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నీకోసం నేను ఉన్నాను. మీరు, నేను మంచి జోడి అవుతాం. మీరు ఓకే అంటే పెళ్లి చేసుకోవ‌డానికి నేను రెడీ. నాకు ఓ రెండు సంవత్సరాల సమయం ఇస్తే.. బాగా డ‌బ్బులు సంపాదించి మీ వద్దకు వ‌స్తాను. నా గుర్తుగా ఈ హార్ట్‌ను ఉంచుకో. ప్లీజ్ మ్యారీ మీ, ప్లీజ్ మ్యారీ మీ సామ్. ప్లీజ్ సమంత, ప్లీజ్ సమంత, ప్లీజ్ సమంత…’ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

Also Read: Sarabjot Singh-Job: నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు: సరబ్‌జ్యోత్‌

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖేష్ చింత చేసిన వీడియో చివరకు స‌మంత కంట పడింది. వీడియో చూసిన స‌మంత.. ‘బ్యాక్‌గ్రౌండ్‌లో జిమ్ ఉంది. నేను దాదాపుగా కన్విన్స్ అయ్యాను’ అంటూ అభిమానికి రిప్లై ఇచ్చారు. సమంత రిప్లై ఇవ్వడంతో ముఖేష్ సంబరపడిపోయాడు. ‘ప్రపంచం సమంతకు వ్యతిరేకంగా ఉంటే.. నేను ప్రపంచానికి వ్యతిరేకిని’ అని అతను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Show comments