NTV Telugu Site icon

Samantha : పాన్ ఇండియా స్థాయిలో సమంత ‘మా ఇంటి బంగారం ‘..

Samantha

Samantha

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ లో వచ్చిన కొన్ని సమస్యల కారణంగా ఆమె కొంతకాలం సినిమాలకు దూరం అయింది. తాజాగా సమంత మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కానుంది.గత ఏడాది సమంత శాకుంతలం ,ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి.ఇక అదే ఏడాది సమంత సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ ను కూడా పూర్తి చేసింది.

Read Also :Pushpa 2 : పుష్ప టీం కీలక నిర్ణయం.. ఇంకెన్నాళ్ళు?

గతంలో “ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సమంత తాజాగా సిటాడెల్ సిరీస్ తో మరోసారి అలరించేందుకు సిద్ధం అవుతుంది.అయితే ఈ సిరీస్ లో సమంత వరుణ్ ధావన్ సరసన నటించింది.ఇదిలా ఉంటే సమంత నటిస్తున్న మరో మూవీ “మా ఇంటి బంగారం”ఈ సినిమాను సమంత తన సొంత బ్యానర్ లో నిర్మించడం విశేషం.సమంత ఓన్ ప్రొడక్షన్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ,నటీనటులు ఎవరనేది ఎవరికీ తెలీదు.ఈ సినిమాను సమంత సీక్రెట్ గా పూర్తి చేస్తుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

Show comments