NTV Telugu Site icon

Akilesh Yadav: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ప్రకటించిన ఎస్పీ అధినేత

Akilesh Yadav

Akilesh Yadav

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు.. 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇండియా కూటమిలో భాగంగా ఉంది. ఈ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే ఇక్కడ మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల మధ్య పొసగడం లేదు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అయితే అలా ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో.. లేదో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చినట్లైంది.

అఖిలేష్ మద్దతు ఇవ్వడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. అఖిలేష్‌ తమ కోసం ఎల్లప్పుడు మద్దతుగా ఉన్నారని, తమ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆప్‌ ఇటీవల నిర్వహించిన మహిళా అదాలత్‌ కార్యక్రమంలోనూ అఖిలేష్‌ పాల్గొని ప్రచారం నిర్వహించారు.

ఇండియా కూటమిలో భాగమైన ఎస్పీ, కాంగ్రెస్, ఆప్.. వేర్వేరుగా వ్యవహారశైలి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కూటమిలో కాంగ్రెస్ ఉంటే.. తాము ఉండమని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. అంతకముందు.. ఆప్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న ఆప్‌పై చర్యలు తీసుకోవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. మొత్తానికి ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది.

Show comments