NTV Telugu Site icon

Vizag Fishing Harbour Fire Incident : నిప్పు వెనుక ఉప్పు చేప..! ఇదేం ట్విస్ట్‌..?

Vizag Fishing Harbour

Vizag Fishing Harbour

Vizag Fishing Harbour Fire Incident : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదం ఘటనలో మరో ఊహించని ట్విస్ట్‌ వెలుగు చూసింది.. అసలు అగ్నిప్రమాదానికి కారణం ఏంటి? ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తగబెట్టారా? లేదా ప్రమాదా వశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ సాగించారు. ఇప్పటికే ఈ కేసు ఎన్నో మలుపులు తిరరగా.. చివరకు అసలు నిప్పు వెనుక ఉన్నది ఉప్పుచేప అని చెబుతున్నారు పోలీసులు.. మత్స్యకారుల కుటుంబాల కొంప ముంచింది ఉప్పు చేప అంటున్నారు. ఫిషింగ్ హార్బర్ లోని బోటులో ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. ఉప్పు చేప వేపింది యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నాని బంధువే అంటున్నారు. నానికి వరుసకి మామ అవుతాడట.. కొద్ది రోజుల క్రితం అదే బోటులో పనిచేశాడట నాని మామ.. అయితే, బోటులో ఉప్పు చేప ఫ్రై చేస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప ఫ్రై చేస్తుండగా.. అగ్నిప్రమాదం సంబంధించి 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి కారకులు అయ్యారు ఇద్దరు వ్యక్తులు.

Read Also: Smallest Polling Booth: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్క కుటుంబం కోసం పోలింగ్‌ బూత్‌!

కాగా, ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు సేకరించారు విశాఖ పోలీసులు.. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు.. 10:48 నిమిషాలకి హడావుడిగా బోటు నుండి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చినట్టు ఆ సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా.. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే అంటే రాత్రి 10:50కి అగ్ని ప్రమాదం జరిగింది.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. అగ్నిప్రమాదం ప్రారంభ దశలో వెలుగులోకి వచ్చింది మరో వీడియో.. అయితే, అగ్ని ప్రమాదానికి ముందే హార్బర్ లో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగగా.. చివరకు ఉప్పు చేపను ప్రై చేయడానికి యత్నించినవారి వల్లే ఈ ప్రమాదం జరిగిందనే నిర్ధారణకు పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది.