టైగర్ మూవీ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఓ సెపరేట్ ట్రెండ్ ను సెట్ చేసాయి..ఇదే జోనర్ లో ఇప్పుడు టైగర్ 3 సినిమా రాబోతుంది. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది… ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్‌డేట్ వచ్చేసింది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసినట్లు తెలుస్తుంది. అలాగే సినిమా రన్ టైం విషయానికి వస్తే.. 157 నిమిషాలు (2 గంటల 33 నిమిషాల 38 సెకండ్స్) ఉన్నట్లు సమాచారం..కాగా దీనిపై మేకర్స్ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు.
ఇదిలా ఉంటే.. టైగర్ 3 ఫుల్ లెంగ్త్ మాస్ కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ కూడా ఎంతో ధీమాగా ఉన్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 12 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. టైగర్ 3 మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఒకే సారి రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా లో సల్మాన్ కు జోడీ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది…అలాగే ఈ సినిమా లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించి సూపర్ హిట్ గా నిలిచాయి.ఇదే కోవ లో వస్తున్న టైగర్ 3 కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఎంతో నమ్మకంతో వున్నారు..
