Site icon NTV Telugu

Salman Khan: మరో ఆరు రోజుల్లో 60వ పుట్టినరోజు.. ఆ ఫిట్‌నెస్‌ ఏంటి భాయ్..!

Salman Khan

Salman Khan

Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. సెలబ్రేషన్లకు కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా, సల్మాన్ ఖాన్ తన ఫిట్‌నెస్‌నే తన పుట్టినరోజు విష్‌గా చూపించారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో సల్మాన్ ఖాన్ రిలాక్స్‌డ్ గా ఉన్నప్పటికీ బాడీ ఫిట్నెస్ పై ఫుల్ ఫోకస్‌తో ఉన్నట్లు కనిపించారు. దీనితో వయసు పెరిగినా తన డిసిప్లిన్‌, ఫిట్‌నెస్‌పై ఉన్న అంకితభావం మరోసారి స్పష్టమైంది.

IPL 2026కు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మాస్టర్ ప్లాన్‌.. బీసీసీఐని ఒప్పించి మరీ..?

ఈ ఫోటోలతో పాటు సల్మాన్, “నేను 60 ఏళ్ల వయసులో కూడా ఇలా కనిపించాలి అనుకుంటున్నా..! ఇక ఆరు రోజులు మాత్రమే ఉన్నాయి” అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. సల్మాన్ పోస్ట్‌కు అభిమానులు భారీగా స్పందించారు. ఒక అభిమాని “మీరు కోట్లాది మందికి ఇన్‌స్పిరేషన్. ఇన్‌స్పిరేషన్ ఎప్పటికీ యువంగానే ఉంటుంది” అని ప్రశంసించాడు. ఇంకొకరు “60లో 80లా కనిపించే వాళ్లను చూశాను.. కానీ సల్మాన్ భాయ్ మాత్రం డిఫరెంట్” అంటూ కామెంట్స్ చేశారు.

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్..? అక్షర్ ను తప్పించనున్న మేనేజ్మెంట్..!

Exit mobile version