Site icon NTV Telugu

Salman Khan: మూడు భాషల్లో రాబోతున్న ‘టైగర్ 3’

Salman Khan

Salman Khan

Salman khan tiger 3 movie update

‘టైగర్’ సీరిస్ లో మూడోదైన ‘టైగర్ 3’ సినిమా ఇప్పుడు మూడు భాషల్లో రిలీజ్ కానుంది. హిందీలో తెరెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా ముందు అనుకున్నట్టు వచ్చే యేడాది ఏప్రిల్ 21న కాకుండా దీపావళి కానుకగా విడుదల చేస్తారట. ఈ విషయాన్ని కీలక పాత్రధారులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా తెలియచేశారు.

శనివారం సల్మాన్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో ‘టైగర్ 3’ పోస్టర్ ను పోస్ట్ చేశాడు. 2023 దీపావళి రోజు ఈ మూవీ వస్తోందని, యశ్ రాజ్ ఫిలిమ్స్ 50తో కలిసి దీపావళిని బిగ్ స్క్రీన్స్ లో సెలబ్రేట్ చేసుకుందామని పేర్కొన్నాడు. టైగర్ సీరిస్ లో తొలి చిత్రం 2012లో వచ్చిన ‘ఏక్ థా టైగర్’. దీన్ని కబీర్ ఖాన్ తెరకెక్కించాడు. రెండవ సినిమా 2017లో ‘టైగర్ జిందా హై’గా వచ్చింది. దీనికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడీ సీరిస్ లో మూడో సినిమా అయిన ‘టైగర్ 3’ని మనీశ్ శర్మ రూపొందించబోతున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సైతం అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే కత్రీనా కైఫ్ నటించిన హారర్ కామెడీ ‘ఫోన్ బూత్’ విడుదల కావాల్సి ఉండగా, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Exit mobile version