NTV Telugu Site icon

Sikandar : `సికింద‌ర్` లో గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ హంటింగ్!

New Project 2024 12 30t095402.232

New Project 2024 12 30t095402.232

Sikandar : యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించడంలో మురుగదాస్ పని తనం గురించి చెప్పాల్సిన పనిలేదు.`గ‌జినీ`,` తుపాకీ` త‌ర్వాత ఆ రేంజ్ సీన్లు మళ్లీ ఆయన మరో సినిమాలో పడలేదు. తన సినిమాలు క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్సెస్ లు అవుతున్నాయి కానీ యాక్షన్ సీన్లలో తన క్రియేటివిటీ కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. మ‌రిప్పుడు ఆ విమ‌ర్శలకు చెక్ పెట్టేలా రెడీ అవుతున్నాడా? అందుకు స‌ల్మాన్ ఖాన్ రియ‌ల్ ఎపిసోడ్ కూడా కలిసొస్తుందా? అంటే అవునన్న ప్రచారం జ‌రుగుతోంది. ప్రస్తుతం ముర‌గ‌దాస్ స‌ల్మాన్ ఖాన్ హీరోగా భారీ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ ` సికింద‌ర్` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే కొద్దిగా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే సికింద‌ర్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని రివీల్ అయింది. కానీ అస‌లు స్టోరీ ఏంటన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడీ క‌థ‌లోకి మురుగ‌దాస్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎటాక్ ని జోడీస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వెలుగులోకి వచ్చింది.

Read Also:Mamata Banerjee: నేడు సందేశ్‌ఖాలీలో పర్యటించనున్న సీఎం మమతా బెనర్జీ..

స‌ల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ గురి పెట్టిన విషయం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స‌ల్మాన్ ఖాన్ తృటిలో త‌ప్పించుకున్నారు. ప్రతిగా బాబా సిద్దిఖీ బ‌లైయ్యారు. అటుపై ముంబైలో ఎంత‌టి హైడ్రామా న‌డిచిందో తెలిసిందే. సెక్యురిటీ లేకుండా స‌ల్మాన్ ఇల్లు దాట‌ని ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. బాల్కానీలో ఉన్న స‌ల్మాన్ పై ఎటాకింగ్.. బెదిరింపు ఈ మెయిల్స్, చంపేస్తామంటూ సోష‌ల్ మీడియా హెచ్చరికలు అబ్బో ఇలా బోలెడంత సీన్ నడిచింది.

Read Also:AP CS Vijayanand: సీఎస్‌గా విజయానంద్‌.. ఉమ్మడి ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి!

క్షమాపణలు చెబితే వదిలేస్తామంటూ ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు. ఇలా రెండు నెల‌ల పాటు బిష్ణోయ్ గ్యాంగ్ స‌ల్మాన్ ఖాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే ఇప్పుడీ స‌న్నివేశాలనే ముర‌గ‌దాస్ సికింద‌ర్ క‌థ‌లో చూపించ బోతున్నాడు? అనే ప్రచారం ఊపందుకుంది. మురుగ‌దాస్ రాసుకున్న క‌థ‌కు స‌ల్మాన్ రియ‌ల్ ఎపిసోడ్ కాస్త ద‌గ్గరగా ఉండడంతో మురుగ‌దాస్ ఈ సాహ‌సానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలు కొత్తేం కాదు. ఛోటా రాజ‌న్, దావూద్ ఇబ్రహీం కథలు ప్రపంచానికి తెలిసినవే. కాబ‌ట్టి ముర‌గ‌దాస్ ని రిస్క్ లో ప‌డేసే అంశం కూడా కాదు. మ‌రి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలి.

Show comments