Site icon NTV Telugu

Nagar Kurnool: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం..

Saleshwaram

Saleshwaram

నేటి నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జాతర కొనసాగనున్నది. తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు హాజరుకానున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. అటవీ శాఖ ఆంక్షలతో తెలంగాణ అమర్నాథ్ యాత్ర జరగనున్నది.

Also Read:US: న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

సలేశ్వరం జాతరకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని సూచించారు.

Exit mobile version