NTV Telugu Site icon

Salaar X Review: ‘సలార్‌’ ఎక్స్‌ రివ్యూ.. మూవీ టాక్‌ ఎలా ఉందంటే?

Salaar X Review

Salaar X Review

Prabhas, Prashanth Neel’s Salaar Movie Twitter Review: ‘కేజీయఫ్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్‌’. అందులోనూ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తుండడంతో.. సలార్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్, పాటలు సినిమాపై మరింత హైప్‌ పెంచేశాయి. సలార్‌ ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా? అని డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ సీనీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. భారీ అంచనాల మధ్య ఈరోజు సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సలార్‌ సినిమా శుక్రవారం (డిసెంబర్‌ 22) విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 1 గంట నుంచే షోలు పడుతున్నాయి. సలార్‌ సినిమా చూసిన ఫాన్స్ ఎక్స్ (ట్విట్టర్)లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ట్విట్టర్‌లో సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్‌కి ఇది ‘మాస్ కమ్ బ్యాక్’ అంటూ ఫాన్స్, నెటిజన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.

‘నీ యమ్మ మెంటల్ ఎక్కించిండు.. ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్‌గా ప్రశాంత్‌ నీల్‌ యూస్ చేశాడు’, ‘ఊచకోత కాదయ్యా.. ఇది రాచకోత. ప్రశాంత్‌ నీల్‌ ఏం తీశాడు భయ్యా సినిమా. రాజమౌళి, బోయపాటిని మిక్సీలో వేసి తీసినట్లున్నాయ్ ఫైట్స్’, ‘మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్. ‘హిట్టు కొట్టేశాం. కేజీఎఫ్‌ను మించి ఉందయ్యా సినిమా’, ‘ఇంటర్వెల్ సీన్ ఒక్కటి చాలు థియేటర్లో సీట్లు చింపేయడాని’, ‘ప్రభాస్ ఓపెనింగ్ సీన్ వేరే లెవల్. ప్రీ ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.